ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎమ్మెల్యే గారు.. మీరు మారాలండి..!

ABN, Publish Date - Apr 01 , 2024 | 12:28 AM

ఇప్పటికైనా మీరు మారండి.. లేక పోయినా పర్వా లేదు.. మారినట్టయినా నటించండి.. ఈ మాట అన్నది ఒక వైసీపీ కార్యకర్త. ఎవరి గురించి అనుకుంటున్నారా.. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడి గురించి.. ఎన్నికల వేళ ఏమా కథ అంటారా మీరే చదవండి మరి..

- పార్టీ మండల సమావేశంలో నిలదీసిన వైనం

నిడదవోలు, మార్చి 31 : ఇప్పటికైనా మీరు మారండి.. లేక పోయినా పర్వా లేదు.. మారినట్టయినా నటించండి.. ఈ మాట అన్నది ఒక వైసీపీ కార్యకర్త. ఎవరి గురించి అనుకుంటున్నారా.. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడి గురించి.. ఎన్నికల వేళ ఏమా కథ అంటారా మీరే చదవండి మరి.. నిడదవోలు పట్టణ వైసీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు నిడద వోలు మండల గ్రామాల్లోని ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి.. ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలంటూ చర్చ ఆరంభించారు.ఈ నేపథ్యంలో మీరు మాట్లా డండి అంటూ గ్రామస్థాయి నాయకులకు మైక్‌ ఇచ్చారు. అయితే చాలా చేపు ఎవరు ముందుకు రాలేదు. ఇంతలో తాళ్ళపాలెం గ్రామానికి చెందిన ఒక నాయ కుడు మైక్‌ అందుకుని కాంగ్రెస్‌ పార్టీలో పదవులు అనుభవించేశాక మీరు వైసీపీలోకి వచ్చారు.. మాకంటే వెనకాలే వైసీపీలోకి వచ్చిన వ్యక్తి మీరని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు ముందే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అలా వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడైనా నాయకులు, కార్యకర్తలను పట్టించుకున్నారా, ఎక్కడైనా కనిపిస్తే అప్యాయంగా పలకరించారా అని నిలదీశారు. ఇప్పటికైనా మీరు మారండి అంటూ బహిరంగంగానే చెప్పేసరికి ఆ నాయకుడి నుంచి మైక్‌ను తీసేసుకున్నారు.మరో పక్క అదే సమావేశంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు పార్టీని వీడనున్నారనే గుసగుసలు వినిపించాయి. వైసీపీ మండల ముఖ్య నాయకులు సమావేశంలో ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడిపై పలువురు నాయకులు అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కడంతో ఇబ్బందిపడ్డారు.

Updated Date - Apr 01 , 2024 | 12:28 AM

Advertising
Advertising