నిడదవోలులో కుర్చీలాట
ABN, Publish Date - Nov 18 , 2024 | 01:04 AM
నిడదవోలులో రాజకీయం మారిపోయింది.. రాజకీయం రసవత్తరంగా మారింది.
జనసేనలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు
మంత్రి దుర్గేష్ సమక్షంలో తీర్థం
చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల చేరిక
ఖాళీ అవుతున్న నిడదవోలు కౌన్సిల్
తగ్గుతున్న వైసీపీ బలం
రసవత్తరంగా రాజకీయం
నిడదవోలు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : నిడదవోలులో రాజకీయం మారిపోయింది.. రాజకీయం రసవత్తరంగా మారింది. చైర్మన్ కుర్చీలాటలో వ్యూహప్రతివ్యూహాలతో రాజ కీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. వైసీపీ రెండు ముక్కలైంది.. ఈ నేపథ్యంలో కొత్త రం గు పులుముకుంది. నేడో రేపో మునిసిపల్ కౌన్సిల్ చేజారిపోయే పరిస్థితి వచ్చింది. నిడ దవోలు మునిసిపాలిటీలో మొత్తం 27 మంది సభ్యులతో నిన్నటి వరకూ వైసీపీ బలంగా ఉంది.అయితే గత శుక్రవారం మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ సమక్షంలో ఆయనతో పాటు మరో పది మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడిపై అసంతృప్తితోనే తా మంతా రాజీనామా చేస్తున్నామని బహిరం గంగానే కొందరు వ్యాఖ్యానించారు. 48 గం టలు గడిచిందో లేదో పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లలో ఆరుగొల్లు వెంకటేశ్వర్లు, ఆకుల ముకుందరావు ఆదివారం మాజీ ఎమ్మె ల్యే జి.శ్రీనివాస్ నాయుడు సమక్షంలో తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో రాజీ నామా చేసిన కౌన్సిలర్ల సంఖ్య 9కి చేరింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రాజకీయం మళ్లీ మారింది. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన 9 మంది కౌన్సిలర్లు మంత్రి దుర్గేష్ సమ క్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. చైర్మన్ భూపతి ఆదినారాయణ,వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, ఎం.డి.షాజీరాబేగం, ముంగంటి మాణిక్యమాల, ఉసురుమర్తి జాన్ బాబు,చిలకల శారదా దేవి,సైదు చంద్ర శేఖర్, మద్దిపాటి నాగశ్రీ,మానుపాటి లక్ష్మి జనసేనలో చేరారు.మిగిలిన కౌన్సిలర్లు వైసీపీ చేజారి పోయే పరిస్థితి ఉంది.అదే జరిగితే నిడదవోలు మునిసిపాలిటీ జనసేన వశమవుతుంది.
ఎందుకిలా..
నిడదవోలు మునిసిపాలిటీ చైర్మన్ కుర్చీ పై ఆదినారాయణ..కామిశెట్టి సత్తిబాబు మధ్య అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు సూచ న మేరకు రెండున్నరేళ్ల ఒప్పందం ఉంది.ఆ లెక్కన ఇప్పటికే ఆదినారాయణ పదవీకాలం ముగిసింది.. అయితే ఒప్పందం కాదని ఇంకా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉం డగా కామిశెట్టి సత్యనారాయణ కుర్చీ వదలా లని పట్టుబడుతున్నారు.అది తప్పించుకు నేం దుకే పార్టీ మారినట్టు విమర్శలు వినిపిస్తు న్నాయి.దీనిపై వైసీపీ నేత కామిశెట్టి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఒప్పం దం ప్రకారం రాజీనామా చేస్తానని బహి రం గంగా ప్రకటించిన భూపతి ఆదినారాయణ పదవీ వ్యామోహంతోనే తెరచాటు వ్యవహా రాలకు తెరలేపారని ఆరోపించారు. ప్రస్తుతం నిడదవోలు చైర్మన్ కుర్చీపై రాజకీయం వాడి వేడిగా కొనసాగుతుంది.
Updated Date - Nov 18 , 2024 | 01:04 AM