అధికారుల వైఖరి, సమస్యలపై సర్పంచ్‌ల ఆగ్రహం
ABN, Publish Date - Jul 20 , 2024 | 12:45 AM
ఇళ్ల నిర్మాణంలో జాప్యం, రోడ్ల ఆధ్వానస్థితి, డ్రైయిన్‌లో వలకట్లు, సర్పంచ్‌ల పట్ల అధికారి వైఖరిపై సర్పంచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అల్లవరం మండల పరిషత్ సమావేశం వాడివేడిగా జరిగింది.
అల్లవరం, జూలై 19: ఇళ్ల నిర్మాణంలో జాప్యం, రోడ్ల ఆధ్వానస్థితి, డ్రైయిన్‌లో వలకట్లు, సర్పంచ్‌ల పట్ల అధికారి వైఖరిపై సర్పంచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అల్లవరం మండల పరిషత్ సమావేశం వాడివేడిగా జరిగింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఇళ్ళ శేషగిరిరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా అసం పూర్తిగా ఉన్న సమస్యలపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మండిపడ్డారు. కొమరగిరిపట్నంలో పింఛన్ల పంపిణీపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు వచ్చిన ఎంపీడీవో కృష్ణమోహన్ అక్కడే ఉన్న సర్పంచ్ రాకాపు విజయలక్ష్మిని పిలవకపోవడం పద్ధతి కాదంటూ ఎంపీపీ శేషగిరిరావు, సర్పంచ్‌లు సాధనాల వెంకట్రావు, దాకారాపు చిరంజీవి, ఎంపీటీసీ పెచ్చెట్టి వెంకటేశ్వరరావు ఆరోపించారు. రామేశ్వరంమొగను ఆటోమోటిక్ లాక్‌సిస్టమ్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని ఎంపీపీ కోరారు. డ్రైయిన్లలో వలకట్లను తొలగించాలని సభ్యులు కోరగా వలకట్లను తొలగించేందుకు చర్యలు చేపట్టామని డ్రైయిన్ ఏఈ సునీత వివరించారు. గృహనిర్మాణాల బిల్లులు మంజూరు చేయాలని ఎంపీటీసీ మౌనిక కోరారు. గూడాల, దేవగుప్తం రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ సభ్యలు ధ్వజమెత్తారు. విద్యుత్ తదితర సమస్యలపై సభ్యులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, జడ్పీటీసీ కొనుకు గౌతమి, వైస్‌ఎంపీపీ ముత్యాల రామకృష్ణ, వడ్డి గంగ, ఎంపీడీవో కృష్ణమోహన్, తహసీల్దారు పి.సునీల్‌కుమార్, జేఈలు జి.సంపన్, జి.స్వామి, డి.శ్రీనివాసరావు, రమేష్, ఏపీఎం సయ్యద్, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2024 | 12:45 AM