సమన్వయంతో ముందుకెళ్లాలి
ABN, Publish Date - Jul 25 , 2024 | 01:18 AM
రాజోలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్లాలని రాజోలు నియోజకవర్గ పరిశీలకుడు చిటికెన రామ్మోహనరావు అన్నారు.
మలికిపురం, జూలై 24: రాజోలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్లాలని రాజోలు నియోజకవర్గ పరిశీలకుడు చిటికెన రామ్మోహనరావు అన్నారు. బుధవారం లక్కవరంఎంజీ గార్డెన్స్‌లో జరిగిన రాజోలు నియోజకవర్గస్థాయి టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలన్నారు. కష్టపడి పనిచేసిన నాయకులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు వాటంతటవే వస్తాయన్నారు. సమావేశానికి అడబాల యుగంధర్ అధ్యక్షత వహించగా గుబ్బల శ్రీనివాస్, ముప్పర్తి నాని, రాపాక నవరత్నం, చాగంటి స్వామి, తాడి సత్యనారాయణ, వర్థినీడి బాబ్జి, దంతులూరి రామకృష్ణంరాజు, మంగెన రాధాకృష్ణ, చెల్లింగిసత్యనారాయణ, అడబాల సాయిబాబు, భూపతిరాజు సాయిబాబు, కాకి లక్ష్మణ్, మంగెన భూదేవి, బందెల పద్మ, కోట పుష్పకుమారి, చెల్లుబోయిన హెలీన, కాండ్రేగుల భవానీ లావణ్య,అడబాల రమాదేవిపాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2024 | 01:18 AM