ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గెద్దాడలో ఓఎన్జీసీ పైపులైను స్వల్ప లీకేజీ

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:05 AM

మామిడికుదురు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ-వేగివారిపాలెం సరిహద్దులో ఓఎన్జీసీకి చెందిన పైపులైను స్వల్పంగా లీకైంది. లీకేజీని గుర్తించిన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పై

పైపులైనుకు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

మరమ్మతులు నిర్వహించిన అధికారులు

మామిడికుదురు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ-వేగివారిపాలెం సరిహద్దులో ఓఎన్జీసీకి చెందిన పైపులైను స్వల్పంగా లీకైంది. లీకేజీని గుర్తించిన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పైపులైను ద్వారా గ్యాస్‌ సరఫరాను నిలుపుదలచేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. తాటిపాక స్ట్రక్చర్‌లోని తాటిపాక 6వ బావి నుంచి పైపులైను ద్వారా నగరం జీసీఎస్‌కు గ్యాస్‌ సరఫరా అవుతుంది. పైపులైనుకు లీకేజీ ఏర్పడిన పైపును సుమారు 10నుంచి 12అడుగుల మేర తొలగించి కొత్త పైపును ఏర్పాటు చేశారు. ఈ బావి నుంచి ఉత్పత్తి అవుతున్న సహజవాయువు హెచ్చుతగ్గుల్లో ఉండడం వల్ల ఇటీవల డ్రిల్లింగ్‌ నిర్వహించారు. తరువాత ఈ బావి నుంచి గ్యాస్‌ ఉ్పత్తి పెరిగిందని సంబంధిత అధికారులు తెలియచేశారు. లీకేజీ అయిన పైపులైనుకు మరమ్మతులు నిర్వహించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:05 AM