ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే ఇసుక

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:25 AM

నూతన ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులు నేరుగా ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ఈ నెల 19 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గనులశాఖ, రవాణాశాఖ సంయుక్తంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఇసుక దారి మళ్లకుండా ఇతరులు అధిక ధరలకు విక్రయించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అమలాపురం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): నూతన ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులు నేరుగా ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ఈ నెల 19 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గనులశాఖ, రవాణాశాఖ సంయుక్తంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఇసుక దారి మళ్లకుండా ఇతరులు అధిక ధరలకు విక్రయించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఇసుక రవాణా చార్జీలను ప్రభుత్వం నిర్ణయించడంతో 20 టన్నుల లారీలకు వేర్వేరుగా కిలో మీటర్ల వారీగా దూరాన్ని బట్టి రవాణా చార్జీలను నిర్ణయించారన్నారు. జిల్లాలో రీచ్‌లు, స్టాకు పాయింట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు ఇసుకను రవాణా చేసేందుకు 300 వరకు వాహనాలు ఉన్నాయని, ఇప్పటికే వంద వాహనాలకు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. ఇసుక రవాణా ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి సాయిరామ్‌సింగ్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తి, రియాల్టీ ఇన్‌స్పెక్టర్‌ కె.సుజాత, డీటీవో అశోక్‌ప్రతాప్‌రావు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 12:25 AM

Advertising
Advertising