పాదగయ క్షేత్రంలో కార్తీకమాసానికి విస్తృత ఏర్పాట్లు
ABN, Publish Date - Oct 30 , 2024 | 01:41 AM
పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో కార్తీకమాసానికి తరలివచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనరు కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు.
పిఠాపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో కార్తీకమాసానికి తరలివచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనరు కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం దర్శన వేళలు పెంచినట్టు చెప్పారు. నవంబరు 2వ తేదీ నుంచి డిసెంబరు 1వ తేదీ వర కూ ప్రతిరోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల దాకా, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల దాకా ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పాదగయ పుష్కరిణిలో పాత నీటిని తొలగించి శుభ్రపరిచిన తర్వాత కొత్త నీరు పెట్టినట్లు చెప్పారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పాదగయ పరిసరాల్లో పారిశుధ్యంపై చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనరును కోరామని, నిత్యాన్నదాన పథకంలో ఎక్కువ మంది భక్తులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
Updated Date - Oct 30 , 2024 | 06:19 AM