పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:14 AM
గ్రామాల అభివృద్ధికి పంచాయతీలు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి కోరారు.
అమలాపురం రూరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి పంచాయతీలు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి కోరారు. పంచాయతీల ఆదాయంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను సక్రమంగా వినియోగించుకునేలా ముందస్తు ప్రణాళిక తప్పనిసరన్నారు. దీనికి సంబంధించి శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఆర్థిక సంఘం నిధులతో పాటు ఉపాధి హామీ నిధులు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. ఎంపీడీవో ఉండ్రు బాబ్జీ, ఈవోపీఆర్డీ బి.మంగాదేవి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
Updated Date - Nov 16 , 2024 | 01:14 AM