డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలు
ABN, Publish Date - Sep 03 , 2024 | 12:08 AM
జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
పలు సేవా కార్యక్రమాలు
అమలాపురం టౌన్, సెప్టెంబరు 2: జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల కేక్‌ను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కట్‌చేసి అభిమానులకు తినిపించారు. సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్, యాళ్ల నాగసతీష్, యేడిద శ్రీను, కంచిపల్లి అబ్బులు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, బీజేపీ నాయకుడు నల్లా పవన్‌కుమార్, కౌన్సిలర్లు బొర్రా వెంకటేశ్వరరావు, పడాల శ్రీదేవి-నానాజీ, తిక్కా సత్యలక్ష్మి, ఆశెట్టి ఆదిబాబు, దాట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. అభిమానులకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు దెందుకూరి సత్తిబాబురాజు, బట్టు పండు, తిక్కా సరస్వతి, పోలిశెట్టి కన్నా తదితరులు పాల్గొన్నారు. జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమలాపురం ఏరియా ఆసుపత్రితో పాటు తాండవపల్లి గ్రామంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలను నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, ఆకుల బుజ్జి, కైరం సత్య, కైరం దొరబాబు, గుమ్మళ్ల సురేష్ పాల్గొన్నారు. టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొద్దోకు నారాయణరావు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం వద్ద పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆనందరావు కేక్ కట్‌చేశారు. కూటమి నాయకులు చుట్టుగుళ్ల కిశోర్, ఇసుకపట్ల రఘుబాబు, బడుగు భాస్కరజోగేష్, అయితాబత్తుల అజయ్, ఈతకోట నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎస్టీయూ జిల్లా కార్యాలయం వద్ద సచివాలయ వలంటీర్ల సంఘం జిల్లా కన్వీనర్ ఎం.సతీష్ ఆధ్వర్యంలో పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. రెడ్డిపల్లిలో సర్పంచ్ కరాటం రత్నప్రసన్న-ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంటింటా, రోడ్లపక్కన మొక్కలు నాటారు. సచివాలయ కార్యదర్శి స్వాతి, రాజులపూడి మహేష్, జ్యోతి, నల్లా సతీష్ పాల్గొన్నారు. తాపీ పనివారల సంక్షేమ సంఘం కార్యాలయంలో గౌరవాధ్యక్షుడు దున్నాల శ్రీను, అధ్యక్షుడు కోటిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సంఘ ప్రతినిధులు చిక్కం వెంకటేశ్వరరావు, రేలంగి ముకుందరావు, నల్లా త్రిమూర్తులు, దొమ్మేటి ఉమ, దామిశెట్టి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 03 , 2024 | 12:08 AM