Pawan Kalyan: పిఠాపురంలో పవన్ రెండో రోజు పర్యటన నేడు
ABN, Publish Date - Mar 31 , 2024 | 08:23 AM
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు ఆదివారం పిఠాపురంలో పర్యటించనున్నారు. పాదగయ క్షేత్రంలో ఉదయం 11గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 12 గంటలకు శ్రీ పాద శ్రీవల్లభ దత్తత్రేయుని దర్శించుకుని పూజలు చేయనున్నారు.
కాకినాడ: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రెండో రోజు ఆదివారం పిఠాపురం (Pithapuram)లో పర్యటించనున్నారు. పాదగయ క్షేత్రంలో ఉదయం 11గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 12 గంటలకు శ్రీ పాద శ్రీవల్లభ దత్తత్రేయుని దర్శించుకుని పూజలు చేయనున్నారు. ఆ తర్వాత బషీర్ బీబీ దర్గా (బంగారు పాప, పొన్నాడ గ్రామం) సందర్శన అనంతరం 1 గంటకు జనసేన, టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. కాగా పవన్‌కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా గడ్డ నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా తన ఎన్నికల వ్యూహాన్ని ఉమ్మడి జిల్లా నుంచి శనివారం మొదలుపెట్టారు. తాను పోటీచేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా అసలు సిసలు ఎన్నికల సమరశంఖం పూరించారు. అమ్మవారి ఆశీస్సులతో వారాహి వాహనమెక్కి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జనాశీర్వాదం అందించాలని పిలుపునిచ్చారు.
కాగా.. పవన్ కల్యాణ్ తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. శనివారం (మార్చి 30 వతేదీ) నుంచి ఏప్రిల్ 12 వరకూ ఆయన పర్యటనలు ఉంటాయి. ఏప్రిల్ 2 వరకూ ఆయన పిఠాపురంలో ఉంటారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం (Ugadi Festival) సందర్భంగా 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పీ గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు.
Updated Date - Mar 31 , 2024 | 08:42 AM