పింఛన్ కష్టాలు.. పెంచెన్!
ABN, Publish Date - May 03 , 2024 | 12:36 AM
మండుటెండలో వడగాడ్పులు తట్టుకుంటూ కిలోమీటర్ల కొద్ది ప్రయాణం, బ్యాంకుల వద్ద తమవంతు వచ్చేవరకూ పడిగాపులు, మీ ఖాతాలు మనుగడలో లేవు, ఈ పత్రాలు తెస్తే ఆన్‌లైన్ చేసి అప్పుడు డబ్బులు ఇస్తామంటూ సిబ్బంది సమాధానం
పండుటాకులపై జగన్ పగ
వైసీపీ ఓటు అరాజకీయం
బ్యాంకుల వద్ద ప్రత్యక్ష నరకం
వృద్ధులు, దివ్యాంగుల ఆపసోపాలు
సగం మంది ఖాతాలు ఇన్‌యాక్టివ్
పింఛను సొమ్ములో చార్జీల పేరిట కోత
వలంటీర్లతో తెర వెనుక రాజకీయం
మండుటెండలో వడగాడ్పులు తట్టుకుంటూ కిలోమీటర్ల కొద్ది ప్రయాణం, బ్యాంకుల వద్ద తమవంతు వచ్చేవరకూ పడిగాపులు, మీ ఖాతాలు మనుగడలో లేవు, ఈ పత్రాలు తెస్తే ఆన్‌లైన్ చేసి అప్పుడు డబ్బులు ఇస్తామంటూ సిబ్బంది సమాధానం. మరికొందరికి మీ అకౌంట్‌లో పడిన సొమ్ముల్లో చార్జిలు, బ్యాంకు రుసుములు పోగా ఇంతే మిగిలింది అంటూ చెబుతుండడంతో లబ్ధిదారులకు ఏమీ అర్థంకాని పరిస్థితి. ఇంటింటికి పింఛన్లు ఇవ్వకుండా తమను తీవ్ర అగచాట్లకు గురిచేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వ తీరుపై లబ్ధిదారుల ఆవేదన.. ఇదీ గురువారం ఉమ్మడి జిల్లాల్లో కనిపించిన దృశ్యాలు.
(పిఠాపురం)
ఎన్నికల వేళ వైసీపీ సర్కారు తెరతీసిన కొత్త డ్రామా పింఛను లబ్ధిదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. వలంటీర్లు ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న జగన్ సర్కారుకు ఇది వరకే ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. పంపిణీ బాధ్యతల నుంచి వలంటీర్లను తప్పించడంతో టీడీపీ, జనసేన పార్టీల కారణం గానే మీకు ఇంటింటికీ పింఛన్లు తెచ్చి ఇవ్వలేకపోతున్నామనే ప్రచారానికి ఏప్రిల్ నెలలో జగన్ సర్కారు, వైసీపీ నేతలు తెరలేపారు. సచివాలయ సిబ్బంది ద్వా రా ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉన్నా ఆ విధంగా చేయకుండా గత నెలలో అందరినీ సచివాలయాలకు రమ్మని అక్కడ పంపిణీ చేపట్టారు. దీంతో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెలలో ఈసీ సూచనలంటూ బ్యాంకు ఖాతాలకు నగదు జమచేయాలని ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం లబ్ధిదారులను అగచాట్లకు గురిచేసింది. ఇప్పుడు మండుటెండలో చెమటలు కారుస్తూ లబ్ధిదారులు బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. దీ నికి టీడీపీ, జనసేన నాయకులే కారణమని చెప్పడం ద్వారా లబ్ధిపొందే ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల లో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు పడ్డ ఇబ్బం దులు చూసిన తర్వాతైనా ప్రభుత్వంలో కదలిక వచ్చి ఇంటింటికీ పంపిణీ చేస్తారని భావించినా ఓట్ల రాజకీ యం మరోలా ఆలోచింపజేసిందనే విమర్శలున్నాయి.
కనీస ఏర్పాట్లు కరవు
పింఛను సొమ్ము తీసుకునేందుకు బ్యాంకుల వద్దకు భారీగా లబ్ధిదారులు తరలివస్తారని తెలిసినా కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో వృద్ధులు, మహి ళలు బ్యాంకుల వద్ద మండుటెండలోనే పడిగాపులు ప డ్డారు. పలువురు వడదెబ్బకు గురయ్యా రు. వడగాడ్పులు వీస్తాయని, బయటకు రావొద్దని వాతావరణ శాఖ స్పష్టమైన హె చ్చరికలు జారీ చేయడంతో పాటు కలెక్టరు ప్రకటన జారీ చేసినా వృద్ధులను ఇలా మండుటెండలో తిప్పుతారా అని పలువురు మండిపడుతున్నారు. వారికి ఏమైనా అయి తే బాధ్యత ఎవరిదని అంటున్నారు. మరో వైపు పలువురికి బ్యాంకు ఖాతాలు ఉన్నా సొమ్ములు జమకాలేదు. దీనికి ఎన్‌సీపీఐ (నేషనల్ పేమెంట్ పోర్టల్)తో ఆధార్ అనుసంధానం కాకపోవడం కారణమని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువచ్చి బయోమెట్రిక్ వేయాలని సూచిస్తున్నారు. బ్యాంకుల వద్ద ఎలా నగదు డ్రా చేయాలి, ఉన్న ఇబ్బందులు, ఏయే పత్రాలు తీసుకురావాలి తదితర సమాచారాన్ని అందించేందుకు బ్యాంకు సిబ్బంది సతమతమయ్యారు. ఇక్కడ సచివాలయాల సిబ్బందిని అందుబాటులో ఉంచితే లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడా రాజకీయమే
బుధవారం బ్యాంకులకు వచ్చి సొమ్ములు తీసుకోకుంటే వెనక్కిపోతాయని వలంటీర్లు (ప్రస్తుతం విధు ల్లో ఉన్నవారు, రాజీనామా చేసిన వారు) చెప్పడంతో లబ్ధిదారులంతా ఒకేసారి బ్యాంకులకు వచ్చినట్టు చెబుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల కారణంగానే మీకు ఈ పరిస్థితి వచ్చిందంటూ వారు లబ్ధిదారుల వద్దకు వెళ్లి చెబుతున్నట్టు ఆరోపణలున్నాయి. కొన్ని మండలాల్లో నేరుగానే ఈ విధంగా ప్రచారం సాగించినట్టు సమాచారం. లబ్ధిదారుల అగచాట్లకు ప్రభు త్వ నిర్ణయం కారణం కాగా... దానికి టీడీపీ, జనసేన లను బాధ్యులను చేయడంపై ప్రతిపక్ష నేతలు మం డిపడుతున్నారు. ఇలా ప్రచారాలు చేసిన వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గత నెల సాఫీగా.. ఈ నెల కుట్రతో..
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
మొన్నటి వరకు టార్గెట్ టీడీపీ.. ఇప్పుడు కూటమి.. ఇదే వైసీపీ పాలకులు అధికార దండం పట్టు కున్న నాటి నుంచీ సాగుతున్న రాజకీయ కక్ష కథా చిత్రమ్. రాజకీయ జగన్మాయా నాటకమ్. ఏదేమైనా టీడీపీపై బురదజల్లడం ఒకటే అంతిమంగా జగన్ లక్ష్యం. ఈ జాడ్యం చివరికి పింఛను తీసుకునే అవ్వాతాతల్నీ వదల్లేదు. ప్రభుత్వ పథకాల పంపిణీకి వలంటీర్లను ఎన్నికల సంఘం దూరం పెట్టిన విషయం తెలిసిందే. దీంతో మార్చి నెల పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఇది సునాయాసంగా రెండ్రోజుల్లో పూర్తయింది. కానీ ఈ నెల పింఛను విషయంలో ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయం తీసు కుందనడంలో సందేహం లేదు. ఈ నెల సామాజిక భద్రత పింఛన్లను బ్యాంకుల ఖాతాల్లో జమచేస్తామని పాలకులు చెప్పారు. మార్చి, ఏప్రిల్ (మే 1 నుంచి పంపిణీ) నెల పింఛన్ల నడుమ నెల సమయం ఉంది. ఈలోపు పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలపై కసరత్తు జరగలేదు. ఎన్ని ఖాతాలు ఆధార్‌కి అనుసం ధానమై ఉన్నాయి?, ఎన్ని ఖాతాలు మూసేశారు, ఎన్ని ఖాతాల్లో లావాదేవీలు ఆగిపోయాయి. ఎన్ని సవ్యంగా పనిచేస్తున్నాయనే అంశాలను పట్టించు కోలేదు. ఐదేళ్లు బటన్ నొక్కుడు పరిపాలన సాగించిన జగన్‌కి ఆ విషయాలన్నీ తెలుసు. కానీ ముసలి ప్రాణాలతో చెలగాటమాడి ఆ పాపాన్ని బురదగా మార్చి టీడీపీపై చల్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రతోనే ఉద్దేశపూర్వకంగానే పింఛను లబ్ధిదారులను ఎండలో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. ఈ కుట్రలో భాగంగా గత నెల కొందరు ప్రాణాలు కోల్పోయినా జగన్‌కి పట్టలేదు. ఇప్పటికే ఈ కుట్రను అర్థం చేసుకున్న లబ్ధిదారులు ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు.
నగదు తీసుకునేందుకు వెళితే షాకులు
నగదు తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన వృద్ధులు, మహిళలకు షాక్‌లు మీద షాక్‌లు తగిలాయి. లబ్ధిదారులకు సంబంధించి ఆయా బ్యాంకుల్లో ఉన్న ఖాతాల్లో సుమారు 50 శాతం వరకూ మనుగడలో లేనట్టు (ఇన్‌యాక్టివ్)గా బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. తిరిగి యాక్టివ్ చేయించుకునేందుకు రెండు ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, పాన్‌కార్డు జిరాక్స్ తీసుకురావాలని వారు సూచిస్తున్నారు. లబ్ధిదారుల్లో 90 శాతం మందికి పాన్‌కార్డు ఉండదు. అటువంటి వారు తమకు లేదని చెప్పడంతో మిగిలిన పత్రాలు తీసుకురావాలని సూచిస్తున్నారు. మరోవైపు మే నెలకు పడిన పింఛన్ సొమ్ము రూ.3 వేలు డ్రా చేసుకునేందుకు ఫారాలు నింపి ఇచ్చిన వారికి మీ ఖాతా లో అంత నగదు లేదని, మీరు బ్యాంకు ఖాతా వాడనందున, కనీస నగదు లేకపోవడంతో చార్జీలు, రుసుములు పేరిట సొమ్ములు కట్ అయ్యాయని బ్యాంకు సిబ్బంది చెబుతుండడంతో ఆ సొమ్ముపైనే ఆధారపడిన లబ్ధిదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
గంటలకొద్దీ పడిగాపులు
పిఠాపురం, మే2: కాకినాడ జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా అన్ని రకాల పింఛన్లు పొందేవారు 2 లక్షల 80 వేల 662 మంది ఉన్నారు. వీరికి పింఛన్లు రూపేణా రూ.83.16 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. లబ్ధిదారుల్లో 25 శాతం మందికిపైగా బ్యాంకు ఖాతాలు లేవు. అయినా లబ్ధిదారుల ఖాతాల కు ప్రభుత్వం నగదు జమచేసింది. దీంతో బుధవారం ఉదయమే కాకినాడ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న బ్యాంకుల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. బ్యాంకుల వద్దకు ఉదయం 8 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకున్న లబ్ధిదారులు రెండు గం టలకు పైగా పడిగాపులుపడ్డారు. జిల్లా కేంద్రమైన కాకినాడతోపాటు పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, పెద్దాపురం, తుని, ఏలేశ్వరం పట్టణాలు, జగ్గంపేట, ఏలేశ్వరం, కొత్తపల్లి, రౌతులపూడి తదితర మండలాల తోపాటు గ్రామాల్లోనూ బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి.
Updated Date - May 03 , 2024 | 12:36 AM