ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పింఛన్‌..ఆనందించెన్‌

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:35 AM

ఎన్టీఆర్‌ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని జిల్లా యంత్రాంగం పరుగుపెట్టిస్తు న్నారు.. ఒక్క రోజులో దాదాపుగా పింఛన్లను పూర్తి చేస్తున్నారు.

తోగుమ్మిలో పింఛన్‌ పంపిణీ చేస్తున్న కలెక్టర్‌

ఒక్క రోజులోనే 96 శాతం

తెల్లవారుజాము నుంచే పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో స్థానం

ఈ నెల కోరుకొండ ఫస్ట్‌

రాజమహేంద్రవరం, నవంబరు 30 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీఆర్‌ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని జిల్లా యంత్రాంగం పరుగుపెట్టిస్తు న్నారు.. ఒక్క రోజులో దాదాపుగా పింఛన్లను పూర్తి చేస్తున్నారు.ఈ నెల అదే వేగం కనిబరి చారు.. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాను నాలు గో స్థానంలో నిలిపారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే పంపిణీ ప్రారంభించగా 11 గంటల కల్లా 90 శాతం పూర్తయిపోయింది. జిల్లాలో మొత్తం 2,37,389 మంది లబ్ధిదారులు ఉండగా రాత్రి 7 గంటల సమయానికి 2,28,032 మందికి పింఛను అందింది.రూ.101కోట్ల 63లక్షల 33 వేలకు 97 కోట్ల 55 లక్షల 29 వేలను అం దజేశారు.మిగతా వారికి పంపిణీ కొనసాగుతోం ది. మండలాల వారీగా చూస్తే కోరుకొండ 97.16, రాజమండ్రి అర్బన్‌ 97.07, నిడదవోలు అర్బన్‌ 96.39 శాతంలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా కొవ్వూరు అర్బన్‌ 94.74 శాతంలో చివరి స్థానంలో ఉంది. పింఛన్ల పంపిణీలో ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్‌ ప్రశాంతి, నిర్వహణా లోపం లేకుండా సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ మధ్యాహ్నానానికే 90 శాతం పూర్తి చేస్తున్న డీఆర్డీఏ పీడీ మూర్తి, పంపిణీ సిబ్బంది ప్రశంసలు అందుకుంటున్నారు.

పింఛనుదారుడు మరణిస్తే..జీవిత భాగస్వామికిస్తాం..

కొవ్వూరు, నవంబరు 30 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో 17 కేటగిరిల కింద 2,37,389 మందికి రూ.101,63,33,000 ఎన్టీఆర్‌ భరో సా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో దివ్యాంగులైన తామరపల్లి నూకరత్నం, తామరపల్లి సంతోష్‌లకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇంటివద్దనే పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు,3 పట్టణాల్లో 9041 క్లస్టర్లలో 5128 మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. డిసెంబరు 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో నవంబరు 30వ తేదీనే పింఛన్లు పంపిణీ చేశామన్నా రు. అనుకోని కారణాల వల్ల పింఛను తీసుకోకపోయినా లబ్ధిదారులకు 3 నెలల వరకు పింఛను బకాయిలు చెల్లిస్తారన్నారు. 3 నెలలు పైబడి తీసుకోని వారి పింఛను నిలిపివేస్తారన్నారు. ఫించనుదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్‌ ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానంలో పింఛను మంజూరు చేస్తారన్నారు. కొవ్వూరు ఆర్డీవో రాణిసుశ్మిత మాట్లాడుతూ కొవ్వూ రు మం డలం,అర్బన్‌ ప్రాంతాల్లో 536 క్లస్టర్ల పరిధిలో 265 మంది సిబ్బంది 14,048 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.పింఛన్ల పంపిణీలో ఎటు వంటి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నామన్నా రు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.ఆమె వెంట ఎంపీడీవో సుశీల,కార్యదర్శి నాగేశ్వరరావు ఉన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:35 AM