ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:06 AM

గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా సంసిద్ధంగా ఉందని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి

ముమ్మిడివరం, సెప్టెంబరు 4: గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా సంసిద్ధంగా ఉందని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆమె పర్యటించారు. గౌతమీ గోదావరి ఏటిగట్టును పరిశీలించి గురజాపులంకలో ముంపు బారినపడే పంటపొలాలను పరిశీలించారు. అధికార యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూనాలంకలో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి వారికి సూచనలిచ్చారు. లంకాఫ్‌ఠాణేలంకలో గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. గ్రామ సర్పంచ్‌ కొప్పిశెట్టి కృష్ణమూర్తితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్యం సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురజాపులంక, కూనాలంక, లంకాఫ్‌ఠాణేలంక గ్రామాల్లో ఉన్న రైతులు పశువుల పాలు తీయడం, కూరగాయలు తెచ్చుకోవడం వంటి పనులకు రాకపోకలు సాగించాల్సి ఉన్నందున వరద పెరుగుతున్న నేపథ్యంలో మూడు మెకనైజ్డ్‌ పడవలు ఏర్పాటు చేయాల్సిందిగా రైతులు కోరగా అవసరమైన మెకనైజ్డ్‌ బోట్లను ఏర్పాటు చేయాలని మత్స్యకారులను ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి మధుసూదన్‌, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు జేసీ వెంట ఉన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:06 AM

Advertising
Advertising