శాశ్వత పరిష్కారమే లక్ష్యం
ABN, Publish Date - Dec 03 , 2024 | 02:06 AM
ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అధికారులంతా పనిచేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.
రాజమహేంద్రవరం రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అధికారులంతా పనిచేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవ స్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో వివిధ మండలాల నుం చి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పీజీఆర్‌ఎస్ నిర్వహణపై సమస్యల పరిష్కా రాల రిపోర్టుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారంవారం సమీక్షిస్తున్నారని చెప్పారు. లాండ్ ఆర్డర్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ఎక్కువ అర్జీలు రావడం జరుగుతోందన్నారు. అర్జీదారులకు శాశ్వత పరిష్కారాలు చూపించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉం డకూడదన్నారు. ప్రజల నుంచి 126 అర్జీలు స్వీకరించారు. వాటిలో ఆన్‌లైన్‌లో 125 ఆఫ్‌లైన్‌లో ఒకటి వచ్చాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, వీఆర్వో సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
5న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు..
ఈనెల 5న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్ని కలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలపై అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు చాలా బాధ్యతగా వ్య వహరించాలన్నారు. అలాగే డిసెంబర్ 5న జరి గే అన్ని గ్రామాల నీటి వినియోగదారుల సం ఘం ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారు లు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.
Updated Date - Dec 03 , 2024 | 02:06 AM