24 గంటల్లో అర్జీలు పరిష్కరించాలి
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:46 AM
ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను 24 గంటల్లో పరిశీలించి చర్యలు చేపట్టాలని అధికా రులకు కలెక్టర్ ఆదేశించారు.
రాజమహేంద్రవరం/రూరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను 24 గంటల్లో పరిశీలించి చర్యలు చేపట్టాలని అధికా రులకు కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక మీకోసం (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి కలెక్టర్ ప్రశాంతి, జేసీ ఎస్.చిన్నరాముడు 144 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూవిభాగానికి 59, పంచాయితీరాజ్ 22, వ్యవసాయ శాఖ 18, పోలీస్ 18, ఇతర శాఖలకు 27 అర్జీలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు.జిల్లా పోలీసు కార్యాల యంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌లో ఎస్పీ నరసింహ కిషోర్ 26 ఫిర్యాదులను స్వీకరించారు.చట్ట పరిధిలో తగు న్యాయం చేయాలని అధికారు లను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు పాల్గొన్నారు.
14 నుంచి ఇంటింటా కేన్సర్ స్ర్కీనింగ్
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : కేన్సర్‌పై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 14 నుంచి ఇంటి వద్దనే ఉచితంగా కేన్సర్ పరీక్షలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఎన్‌సీడీ 3.0 కార్యక్రమంలో భాగంగా ప్రజలకు షుగర్, బీపీ, నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖ ద్వార కేన్సర్‌కు సంబంధించి ఉచితంగా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేన్సర్‌పై విజయం స్ర్కీనింగ్‌తోనే సాధ్యం అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో జేసీ చిన్నరాముడు, డీఆర్‌వో టి.శ్రీరామచంద్రమూర్తి,డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి, జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరిశ్చంద్ర, ఎపిడమాలజిస్ట్ సుధీర్, అధికారులు పాల్గొన్నారు.
పిల్లలందరికీ హెల్త్‌కార్డులు
చైల్డ్ స్ర్కీనింగ్‌కు సంబంధించి హెల్త్‌కార్డును కలెక్టర్ ప్రారంభించారు. 18 ఏళ్లలోపు పిల్లలందరికీ హెల్త్‌కార్డులను అందజేయడం జరుగుతుందన్నార.వైద్య సిబ్బ ంది ద్వారా ఆ కార్డులో సంబంధిత పిల్లవాడికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారాన్ని నింపడం జరుగుతుందని తెలిపారు. నవంబరు 12 నుంచి 28వ తేదీ వరకూ సాన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 పోలింగ్ కేంద్రాలు : కలెక్టర్
రాజమహేంద్రవరం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల షెడ్యూలు సోమ వారం విడుదలైందని, ఈ నెల 18వ తేదీలోపుగా నామినేషన్లు దాఖలు చేయాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కాకినాడ జిల్లా కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారిగా తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తారని చెప్పారు. తూర్పు గోదావరిలోని 18 మండలాల్లో ఒక్కోటి చొప్పున, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రెండు మొత్తం 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.పురుషులు 1597, మహిళలు 1307 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమలో ఈ నెల 4 నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని గుర్తు చేశారు. నియమావళి పర్యవేక్షణకు 21 బృం దాలను నియమించామన్నారు. ఎన్నికలు ప్రశాంతం గా జరిగేలా చూడాలన్నారు.
ముఖ్య తేదీలు ఇవే : నోటిఫికేషన్ జారీ నవం బరు 11, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 18, పరి శీలన 19, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 21, పోలింగ్ డిసెంబరు 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, 9న ఓట్ల లెక్కింపు,12న ఎన్నికల కోడ్ ముగింపు.
Updated Date - Nov 12 , 2024 | 12:46 AM