దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు
ABN, Publish Date - Nov 13 , 2024 | 01:06 AM
జిల్లాలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంపీడీవోలు గూగుల్‌షీట్ ఏర్పాటు చేసి దివ్యాంగుల అవసరాలను గుర్తించాలన్నారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు ప్రతి మొదటి సోమవారం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగుల పునరావాస కేంద్రం అద్దె భవనంలో ఉన్నందున దాన్ని పరిశీలించి ప్రభుత్వ భవనంలోకి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని సోషల్ వెల్పేర్ అఽధికారిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎదుగుదల లేని పిల్లలను ముందుగానే గుర్తించాలని, ఐదేళ్లలోపు పిల్లల ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా విజిలెన్స్ నిర్వహణ
రాజమహేంద్రవరం రూరల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇసుక రీచ్‌ల వద్ద క్షేత్రస్ధాయిలో విజిలెన్స్‌ను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్‌లో ఇసుక రవాణా ట్రాన్స్‌స్పోర్టర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి రోజు 30వేల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఇసుక సరఫరా విధానంలో ఉద్దేశ్య పూర్వకంగా ఇబ్బందులు కలుగజేస్తున్న వారి విషయంలో ఉపేక్షించే ప్రసక్తేలేదని, రీచ్‌ల వద్ద అడ్డుకునే సొసైటీల గుర్తింపులు రద్దుచేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మైన్స్ అధికారి డి.ఫణి భూషణ్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ అధికారి సంపత్‌కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు రావూరి రాజా, శ్రీనివాస్, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 01:06 AM