సందడే..సందడి
ABN, Publish Date - Nov 18 , 2024 | 01:03 AM
సండే సంతోషంగా గడిపారు..ఆడారు.. పాడారు.. డ్యాన్స్‌లతో అలరించారు.. ఎటు చూసినా కార్తీక వనసమారాధనలు హోరెత్తాయి.
ఉత్సాహంగా పాల్గొన్న జనం
కిటకిటలాడిన పిక్నిక్ స్పాట్‌లు
నిండిన గోదావరి పుష్కరవనం
తరలివచ్చిన నాయకగణం
విందు భోజనాలు ఆరగింపు
బహుమతులతో హుషారు
ఎక్కడికక్కడ సేదదీరిన జనం
రాజమహేంద్రవరంసిటీ/దివాన్‌చెరువు/రాజా నగరం/ పెరవలి/, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : సండే సంతోషంగా గడిపారు..ఆడారు.. పాడారు.. డ్యాన్స్‌లతో అలరించారు.. ఎటు చూసినా కార్తీక వనసమారాధనలు హోరెత్తాయి. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున కార్తీక వన సమారాధనలు నిర్వహించారు. దీంతో పిక్నిక్ స్పాట్‌లు సందర్శకులతో కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పిక్నిక్‌ల సందడి నెల కొంది. జనం గార్డెన్ పార్టీలతో పండుగ చేసుకు న్నారు. కుటుంబాలతో కలిసి వచ్చారు 10 మందీ సాయంత్రం వరకూ సరదాసరదాగా గడిపారు. మహిళలు రోజంతా సేదతీరారు.. గార్డెన్ పార్టీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూళ్లు ,కాలేజీలు, వివిధ సామాజిక వర్గాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ యూనియన్లు, అపార్ట్‌మెంట్ అసోసియే షన్లు ఎవరికి వారే పిక్నిక్‌ల బాట పట్టారు. జిల్లాలో మామిడి, కొబ్బరితోటలు, గోదావరి గట్లు, పార్కులు పిక్నిక్‌లతో సందడిగా మారాయి. రాజ మహేంద్రవరానికి కూతవేటు దూరంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పుష్కరవనంలో అయితే ఎటు చూసినా జనమే. పచ్చని వనంలో ఉద యం నుంచి సాయంత్రం వరకూ ఆస్వాదించా రు. ఆనందంగా గడిపారు. భారీ వృక్షాలు.. పెద్ద పెద్ద చెట్ల మధ్య చల్లని వాతావరణంలో సందడి చేశారు. కడియం పూలతోటలు సందర్శకులతో కిటకిటలాడాయి. తోటల్లో పెద్ద ఎత్తున కార్తీక వనస మారాధనలు జరిగాయి. రాజానగరంలోని పలు గెస్ట్‌హౌస్‌లు, బీవీ రాజు లేఅవుట్, కోరు కొండ పాండవుల కొండ,గోకవరం సూదికొండ, పెరవలి మండలం తీపర్రు తది తర ప్రాంతా లకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. గోదా వరి పరీవాహక ప్రాంతాల్లోనూ సందర్శకులు భారీగా కనిపించారు. తోటలు,నర్సీరీలు గోదావరి ఇసుకతిన్నెలు జనంతో నిండిపోయాయి. సామా జిక వర్గాల వారీగా నిర్వహించే పిక్నిక్‌లు హోరె త్తాయి.ఉద్యోగ సంఘాలు కార్తీక వనసమా రాధ నల బాటపట్టాయి. డీజేలు, సినిమా నటు లతో డ్యాన్సులు,కళాకారులతో స్టెప్పులు, ఆట పాటలతో సందడి చేశారు. చిన్నారులైతే ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు జనం పిక్నిక్ స్పాట్లలో పెద్ద ఎత్తున సందడి చేశారు. ఆటపా టలు, వినోదాలతో పాటు విందు అదర గొట్టారు. వెజ్, నాన్‌వెజ్ భోజనాలతో అలరించా రు. పలు చోట్ల లక్కీడిప్‌లు నిర్వహించారు. ఆయా వనస మారాధనల్లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కను మూరురఘురామకృష్ణరాజు, రాజమహేంద్రవ రం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ తదితరులు హాజరై విందు స్వీకరిం చారు. కాసేపు తమ అనుకునేవారితో ఆనందంగా గడిపారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆలస్యంగా వస్తే ఫైన్..
పెరవలి మండలం తీపర్రు గోదావరి తీరంలో తణుకు రూరల్ మెడికల్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వ హించిన వన సమారాధన వినూత్నంగా సాగింది.కమిటీ ఆధ్వర్యంలో వన సమారాధ నకు ఆలస్యంగా వస్తే ఫైన్ వేశారు.ఉద య ం 8 గంటలకు వస్తే ఉచితంగా రావొ చ్చు. 9 గంటలకు వస్తే రూ.50.. 10 గంటలు దాటితే రూ.75.. మరొక గంట ఆలస్యంగా అంటే 11 గంటలకు వస్తే రూ.100..అంటే గంటకూ రూ.25లు చొప్పున పెంచి జరి మా నా వ సూలు చేశారు.12 గంటలు దాటిన తరువాత భోజనానికి వస్తే రూ.200 చొప్పున వసూలు చేశారు.సభ్యులు త్వరగా రావాలనే గత పదే ళ్లుగా ఇలా చేస్తున్నట్టు సంఘ అధ్య క్షుడు సింహాద్రి సూర్య భగవాన్ తెలిపారు. ఆదివా రం ఒక్క రోజే సుమారు రూ.12 వేలు వసూ ళ్లయ్యిందన్నారు.ఈ మొత్తం పేద విద్యార్థుల సేవలకు వినియోగిస్తామన్నారు.
మహిళలకు బంగారం.. పురుషులకు వెండి..
రాజానగరంమండలం చక్రద్వారబంధంలో శ్రీ కాకతీయ అసోసియేషన్ ఫర్ మ్యాన్ కైండ్ మోరల్స్ అండ్ ఎచీవ్‌మెంట్ ఆధ్వ ర్యంలో నిర్వ హించిన కమ్మ వర్గీయులు కార్తీక వనసమారాధనలో లక్కీడిప్ నిర్వ హించారు. విజేతలకు బంగారు, వెండి కాను కలు అంద జేశారు.ప్రఽథమ, ద్వితీయ, తృతీయ బహు మతులు సాధించిన మహిళలకు వరు సగా రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేలు విలువ చేసే బంగారు ఆభరణా లను అంద జేశారు. పురుషుల విభాగంలో ప్రథ మ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.లక్ష, రూ.50 వేలు,రూ.25 వేలు విలువ చేసే వెండి వస్తు వులు బహుమతులుగా ఇచ్చారు.
జిల్లా వాసుల ఆదరాభిమానాలు మరువలేను : రఘురామ
దివాన్‌చెరువు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వాసుల ఆదరాభిమానాలు మరువలేనని రాష్ట్ర శాసససభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజమహేంద్రవరం క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్‌లో ఆదివారం నిర్వహించిన కార్తీక వనసమారాధనకు హాజరై మాట్లాడారు. క్షత్రియుల మనోసంకల్పబలం గొప్పదని అన్నారు. గత పాలకులు తనను అన్ని విధాలుగా హింసకు గురి చేసిన సందర్భంలో జిల్లా క్షత్రియులు తనకు అండగానిలిచి తన పోరాటానికి మద్దతుగా నిలబడ్డారన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో బాటు ఇతర రాష్ట్రాల నుంచి కుడా తరలివచ్చిన క్షత్రియులు కుటుంబాలతో రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, పచ్చమట్ల ధర్మరాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతలపాటి వెంకటపతి రాజు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మంతెన సత్యనారాయణరాజు, అల్లూరు మాధవవర్మ, నాయకులు మంతెన కేశవరాజు, బైర్రాజు ప్రసాదరాజు, ఎస్‌వీఎస్ అప్పలరాజు, కనుమూరి కిరణ్ కుమార్ రాజు, సినీదర్శకులు దండు కార్తీక్‌వర్మ, ఎం.కుమార్‌రాజు, జంపన సుబ్బరాజు, నటుడు సూర్యతేజ పాల్గొన్నారు.
Updated Date - Nov 18 , 2024 | 01:03 AM