ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యవసాయాధికారులు నష్టాలను నమోదు చేయాలి

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:19 AM

పిఠాపురం, సెప్టెంబరు 6: సుద్దగడ్డ వరదలు, అకాలవర్షాలు తగ్గినందున వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలకు జరిగిన నష్టాలను నమోదు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. ఈ క్రాప్‌బుకింగ్‌ సక్రమంగా చేయడం లేదని, పొలాలను వ్యవసాయ సిబ్బం

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, సెప్టెంబరు 6: సుద్దగడ్డ వరదలు, అకాలవర్షాలు తగ్గినందున వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలకు జరిగిన నష్టాలను నమోదు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. ఈ క్రాప్‌బుకింగ్‌ సక్రమంగా చేయడం లేదని, పొలాలను వ్యవసాయ సిబ్బంది సందర్శించడం లేదని రైతులు నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, పరిహారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడైనా వ్యవసాయ సిబ్బంది, అధికారులు పంటనష్టాలు సక్రమంగా రాయకపోయినా, ఈ క్రాప్‌ నమోదు చేయకపోయినా, ఈ విషయంలో రాజకీయాలు చేసినా టీడీపీ కార్యాలయానికి ఫోన్‌ చేసి తెలియజేయాలని తాను తక్షణం వచ్చి వారికి అండగా నిలుస్తానని తెలిపారు. సమావేశంలో టీడీపీ నేతలు కొండేపూడి సూర్యప్రకాష్‌, పిల్లి చిన్నా, కొరుప్రోలు శ్రీను, సోము సత్యనారాయణ, నామా దొరబాబు, నల్లా శ్రీను, సూరవరపు సుబ్బారావు, కోళ్ల బంగారుబాబు, అల్లవరపు నగేష్‌, రాయుడు శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 12:19 AM

Advertising
Advertising