ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌రెడ్డి పిచ్చితుగ్లక్‌ నిర్ణయంతోనే వరద కష్టాలు

ABN, Publish Date - Sep 04 , 2024 | 12:12 AM

గొల్లప్రోలు, సెప్టెంబరు 3: జగన్‌రెడ్డి పిచ్చితుగ్లక్‌ నిర్ణయంతోనే గొల్లప్రోలుతో పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వరద కష్టాలు వచ్చి పడ్డాయని పిఠాపు రం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుద్దగడ్డ వరదల కారణంగా గొల్లప్రోలు వద్ద ముంపునకు గురైన పం

గొల్లప్రోలులో ముంపులో ఉన్న పంటపొలాలు పరిశీలిస్తున్న వర్మ

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

గొల్లప్రోలు, సెప్టెంబరు 3: జగన్‌రెడ్డి పిచ్చితుగ్లక్‌ నిర్ణయంతోనే గొల్లప్రోలుతో పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వరద కష్టాలు వచ్చి పడ్డాయని పిఠాపు రం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుద్దగడ్డ వరదల కారణంగా గొల్లప్రోలు వద్ద ముంపునకు గురైన పంటపొలాలను ఆయన మంగళవారం పరిశీలించారు. పొలాల్లోకి దిగి కుళ్లిపోతున్న వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణకు తాను ఎమ్మెల్యేగా ఉండగా రూ.156కోట్లు మంజూరు చేయించి సీఎం చంద్రబాబుతో శంకుస్థాపన చేయించానని గుర్తు చేశారు. పనులు ప్రారంభించగా ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ ఆ పనులను రద్దు చేశారని తెలిపారు. అదేవిధంగా 60శాతం పూర్తయిన ఏలేరు ఫేజ్‌-1 పనులను నిలిపివేశారని చెప్పారు. దీనితో వరదలు వచ్చిన ప్రతిసారి వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని, త్వరలోనే కూటమి ప్రభుత్వం ఈ పనులు ప్రారంభిస్తుందని తెలిపారు. ఆయన వెంట టీడీపీ పట్టణ, మండలశాఖ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు, ఉలవకాయల దేవేంద్రుడు, బస్సా సత్యనారాయణ, దువ్వా తాతాజీ, ఓరుగంటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

శ్రావణ శుక్రవారం పూజలకు పిలవలేదు

పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రావణమాసం శుక్రవారం జరిగిన వరలక్ష్మి వ్రత పూజలకు రమ్మని తనను ఎవ్వరు పిలవలేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక టిక్కెట్‌ ఇవ్వలేదని తెలిపారు. తన 22ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలిసారి శ్రావణ శుక్రవారం పూజల్లో తాను, తన సతీమణి పాల్గొనలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణమా సం ఆఖరిరోజు సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్ర ంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం ప్రత్యేక పూజలు చేసి మీడియాతో మాట్లాడారు.

Updated Date - Sep 04 , 2024 | 12:12 AM

Advertising
Advertising