ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి పనికి ర్యాటిఫికేషన్‌ అంటే ఎలా?

ABN, Publish Date - Sep 01 , 2024 | 12:19 AM

పిఠాపురం, ఆగస్టు 31: ప్రతి పనికి ర్యాటిఫికేషన్‌ అంటే ఎలా, కౌన్సిల్‌ వాయిదా వేసిన అంశాలకు ముందుస్తు అనుమతి తీసుకుని మమ్మల్ని అవమానిస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్‌హాలులో వైస్‌చైర్మన్‌-1 పచ్చిమళ్ల జ్యోతి అధ్యక్షతన శని

పిఠాపురంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు ఆగ్రహం

పిఠాపురం, ఆగస్టు 31: ప్రతి పనికి ర్యాటిఫికేషన్‌ అంటే ఎలా, కౌన్సిల్‌ వాయిదా వేసిన అంశాలకు ముందుస్తు అనుమతి తీసుకుని మమ్మల్ని అవమానిస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్‌హాలులో వైస్‌చైర్మన్‌-1 పచ్చిమళ్ల జ్యోతి అధ్యక్షతన శనివారం కౌన్సిల్‌ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది. కౌన్సిలరు తలిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అత్యవసర పనులకు మాత్రమే చేయాల్సిన ర్యాటిఫికేషన్‌ను ప్రతి సాధారణ పనికి చేయించడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్‌ అజెండాలో 70శాతంపైగా ర్యాటిఫికేషన్‌ అంశాలే ఉన్నాయని తెలిపారు. కౌన్సిల్‌ గత సమావేశాల్లో వాయిదా వేయాలని సూచించిన అంశాలకు ర్యాటిఫికేషన్‌ ఎలా తీసుకుంటారని నిలదీశారు. అత్యవసర పనులు, బడ్జెట్‌ అంశాలు మినహా మిగిలిన ర్యాటిఫికేషన్‌ అంశాలన్నింటిని తిరస్కరిస్తున్నట్లు తలిశెట్టి ప్రకటించగా, మిగిలిన కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. పురపాలక సంఘంలో పలు అవకతవకలు జరుగుతున్నాయని తలిశెట్టి, టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ అల్లవరపు నగేష్‌ ఆరోపించారు. కుళాయిల ద్వారా కలుషితమైన తాగునీరు సరఫరా చేస్తున్నారని, దీంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారని కౌన్సిలర్లు బొజ్జా జగదీశ్వరీ, నీలవేణి, బండి ఉమామహేశ్వరి, పోచయ్య, రాయుడు శ్రీనులు తెలిపారు.

Updated Date - Sep 01 , 2024 | 12:19 AM

Advertising
Advertising