ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రధాని మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు

ABN, Publish Date - Jun 11 , 2024 | 12:44 AM

ఈనెల 12న (రేపు) చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి గన్నవరం మండలం కేశరపల్లి గ్రామ సమీపంలోని ఐటీ పార్క్‌ గ్రౌండ్‌లో ఏర్పా ట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

రాజమహేంద్రవరం, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ఈనెల 12న (రేపు) చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి గన్నవరం మండలం కేశరపల్లి గ్రామ సమీపంలోని ఐటీ పార్క్‌ గ్రౌండ్‌లో ఏర్పా ట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకా రాన్ని స్వయంగా తిలకించడానికి ప్రధాని మోదీ వస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ట్రాఫిక్‌ని మళ్లించనున్నారు. బుధవారం ఉదయం 4గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ జాతీయ రహదారిపై సరుకు రవాణా, భారీ వాహనాలను రాష్ట్రంలో 12 చోట్ల దారి మళ్లిస్తారు. ఈ విధులకు ఏడు గురు ఐపీఎస్‌ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. విశాఖప ట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హెవీ, మీడియం ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు కత్తిపూడి వద్ద దారి మళ్లించి కాకినాడ, అమలాపురం, నర్సాపురం, లోసర బ్రిడ్జి, మచిలీపట్నం, రేపల్లే, బాపట్ల, త్రోవగుంట మీదుగా ఒంగోలు వద్ద జాతీయ రహదారికి చేరుకుంటాయి. ఈ బాధ్యతలను కాకినాడ ఎస్పీ సతీశ్‌కుమార్‌ పర్యవేక్షిస్తారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనా లను గామన్‌ బ్రిడ్జి, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, ఖమ్మం గుండా హైదరాబాద్‌ పంపిస్తారు. ఈ విధులను తూర్పుగోదావరి ఎస్పీ జగదీశ్‌ పర్యవేక్షిస్తారు. రేపు(బుధవారం) ట్రాఫిక్‌ మళ్లింపులను తెలుసుకు ంటూ వాహనదారులు రాకపోకలు సాగించాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు. రహదార్లపై వాహనాలు నిలపడం, ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించే విధంగా వ్యవహరించడం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 12:44 AM

Advertising
Advertising