ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గూడు లేని బతుకు

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:30 AM

కష్ట జీవుల కన్నీటి గాథ ఇది..గూడు లేని పేద బతుకుల గోడు ఇది..తలదాచుకునే చోటు కోసం అల్లాడుతున్న ఓ కుటుంబం బతుకు చిత్రమిది...35 ఏళ్ల కిందట కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ డ్రైనేజీ కోసం తెచ్చిన తూరనే ఇల్లుగా చేసుకుని కాలం వెల్లదీస్తున్న విషాద నేపథ్యం మడిమి దుర్గారావు కుటుంబానిది. అతను అతని భార్య దుర్గమ్మ, వారి కుమారుడు రామచంద్రపురం పెద్దవంతెన వద్ద వెల్ల రోడ్డు మలుపులో ఓ సిమెంట్‌ తూరలోనే జీవనం సాగిస్తున్నారు.

దుర్గారావు కుటుంబం

ఎలుకలు, దోమల మధ్య ఇరుకు ప్రదేశంలో జీవనం

ఆధార్‌, రేషన్‌ కార్డులున్నా ప్రభుత్వ గృహం రాలేని వైనం

రామచంద్రపురం(ద్రాక్షారామ), సెప్టెంబరు 15: కష్ట జీవుల కన్నీటి గాథ ఇది..గూడు లేని పేద బతుకుల గోడు ఇది..తలదాచుకునే చోటు కోసం అల్లాడుతున్న ఓ కుటుంబం బతుకు చిత్రమిది...35 ఏళ్ల కిందట కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ డ్రైనేజీ కోసం తెచ్చిన తూరనే ఇల్లుగా చేసుకుని కాలం వెల్లదీస్తున్న విషాద నేపథ్యం మడిమి దుర్గారావు కుటుంబానిది. అతను అతని భార్య దుర్గమ్మ, వారి కుమారుడు రామచంద్రపురం పెద్దవంతెన వద్ద వెల్ల రోడ్డు మలుపులో ఓ సిమెంట్‌ తూరలోనే జీవనం సాగిస్తున్నారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నా..పదేళ్లుగా అదే దారిలో ఎంతో మంది నేతలు వెళుతున్నా ఒక్కరికి కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచన రాకపోవడం దారుణం. దుర్గారావు భార్య బధిర మహిళ.. దుర్గారావు కూలి పనికి వెళుతుండగా.. దుర్గమ్మ ఇండ్లలో పనిచేస్తుంది. వీరి జీవితం పదేళ్లుగా ఆ తూరకే అంకితం అయిపోయింది. ఎలుకలు వస్తున్నా..దోమలు కుడుతున్నా అక్కడే బతకాల్సిన పరిస్థితి వారిది.. ఆధార్‌ కార్డు ఉన్నా, రేషన్‌ కార్డు ఉన్నా వారికి పక్కా ఇల్లు మంజూరు కాలేదు. ప్రతి పేదవాడికి గూడు కల్పించే బాధ్యత తీసుకుంటామని ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలోని వాస్తవాలు పూర్తి విరుద్ధంగా ఉంటాయనేదానికి దుర్గారావు కుటుంబమే ఉదాహరణ...

Updated Date - Sep 16 , 2024 | 12:30 AM

Advertising
Advertising