ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ ప్రకారం క్షేత్రస్థాయి సర్వే చేయాలి

ABN, Publish Date - Sep 19 , 2024 | 01:37 AM

కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ ప్రకారం క్షేత్రస్థాయిలో సంపూర్ణ సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. సర్వేచేసే గ్రామాలు, మండలాల వారీగా డివిజన్‌ స్థాయిలో మ్యాపులను సిద్ధం చేయాలన్నారు.

అమలాపురం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ ప్రకారం క్షేత్రస్థాయిలో సంపూర్ణ సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. సర్వేచేసే గ్రామాలు, మండలాల వారీగా డివిజన్‌ స్థాయిలో మ్యాపులను సిద్ధం చేయాలన్నారు. సర్వేలో భాగంగా ఏయే శాఖలకు సంబంధించి ప్రస్తుతం అలైన్‌మెంట్‌లో ఉన్న గ్యాస్‌ పైపులైన్లు, రహదారులు, ఇల్లు, భవనాలు వంటివి తొలగించాల్సి వస్తుందో పూర్తి నివేదికను సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. డివిజన్‌లోని తహసీల్దార్లు, ఆర్డీవోలతో బుధవారం కలెక్టరేట్‌లో రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాథమికంగా నిర్వహించిన తొలి సర్వే నివేదికపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ చర్చించారు. రైల్వేలైన్‌ ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న వాటి వివరాలను సర్వే నంబర్ల వారీగా నివేదించాలన్నారు. భవన నిర్మాణాలు ఎప్పుడు జరిగాయి, వాటి నిర్మాణ విలువ వంటి అంశాలను క్షుణ్ణంగా నివేదిక రూపొందించాలన్నారు. మరోసారి జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో చర్చించి ఆయా శాఖలకు సంబంధించిన నివేదికలు అందజేస్తామన్నారు. అమలాపురం రూరల్‌ మండలంలో భట్నవిల్లి, కామనగరువు, ఇమ్మిడివరప్పాడు, పేరూరు, రోళ్లపాలెం, చిందాడగరువు, అల్లవరం మండలం బోడసకుర్రు, మామిడికుదురు మండలం పెదపట్నం, నగరం, గెద్దాడ, రాజోలు మండలం శివకోడు, చింతలపల్లి, పాలగుమ్మి, బి.సావరం, కడలి, శివకోడు, మలికిపురం మండలంలో మట్టపర్రు, గుడిమెళ్లంక గ్రామాలు రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌లో ఉన్నాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, ఆర్డీవోలు జి.కేశవర్ధనరెడ్డి, జేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

538 హెక్టార్లలో ముంపు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా జిల్లాలో 538 హెక్టార్లలో వరి పంట ముంపు బారిన పడినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, ప్రత్యేక ముఖ్య కార్యదర్శ రాంప్రకాష్‌ సోసోడియా అమరావతి నుంచి బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వరదల కారణంగా ముంపు బారిన పడిన మండలాలు, గ్రామాలు, దెబ్బతిన్న పక్కా గృహాలు, కచ్చా గృహాలు, పశువుల కొట్టాలు, పశునష్టం, పంట నష్టంపై జిల్లాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ వరి పంట 538 హెక్టార్లలో ముంపు బారిన పడిందని, 33 గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఒక పశువుల కొట్టం దెబ్బతిందన్నారు. ఇక 1926 హెక్టార్లలో ఉద్యాన పంటలు ముంపు బారిన పడినట్టు వివరించారు. ఐదు గేదెలు, 34 గొర్రెలు, మేకలు భారీ వర్షాలకు మృతిచెందాయన్నారు. 38,148 గృహాలు ముంపునకు గురయ్యాయని ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా 35,330 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ, ఏవో కె.కాశీవిశ్వేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు పాల్గొన్నారు.

కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు

జిల్లాలో కౌలుదారులందరికీ రుణ అర్హత కార్డులు పారదర్శకంగా జారీ చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జీవో నంబరు 596 ప్రకారం నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రుణ అర్హత కార్డులు జారీ చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి ఇ-పంట నమోదు రైత్వారీ ఈకేవైసీ నమోదు సామాజిక తనిఖీ నిర్వహణ, పీఏసీఎస్‌ల రికార్డుల కంప్యూటరైజేషన్‌ తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. జీవోను అనుసరించి ఈ నెల 25 నాటికి రుణ అర్హత కార్డుల జాబితాల నివేదిక సమర్పించాలన్నారు. జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సూచనల మేరకు ఆక్వా చెరువులకు అనుమతి ఇవ్వాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో కనీసం ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే రికార్డుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మండల కేంద్రాల్లో వర్షపాతం రీడింగ్‌ నమోదయ్యే పరికరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 166 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల డేటా కంప్యూటరీకరణ అక్టోబరు 2 నాటికి నూరు శాతం పూర్తి చేయాలన్నారు. ఈ-పంటలో భాగంగా ఈ-ఫిష్‌ చెరువుల విస్తీర్ణం నమోదు కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లాలో ఎటువంటి ఇసుక తవ్వకాలు, ఇసుక విక్రయాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. అక్టోబరు 15 నుంచి పూర్తిస్థాయిలో రీచ్‌లలో ఇసుక లభిస్తుందని స్పష్టం చేశారు. పొలం పిలుస్తుంది వాల్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు, ఉద్యానవన అధికారి బీవీ రమణ, ఆర్డీవోలు ఎస్‌.సుధాసాగర్‌, జేవీవీ సత్యనారాయణ, జి.కేశవర్థనరెడ్డి, ఆయా శాఖల మండల శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 01:37 AM

Advertising
Advertising