ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాబోయ్‌.. రైలు ప్రమాదం!

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:09 AM

రైలు బోగి నుంచి పొగలు వస్తు న్నాయి.. మరో వైపు సిబ్బంది అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు.. కొందరు రక్తం కారు తున్న ప్రయాణికులు కిందకు దించు తుంటే.. మరికొందరు కట్టుకడుతున్నారు..

ఒక బాలుడిని స్ర్టెచ్చర్‌పై తీసుకొస్తున్న సిబ్బంది

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రైలు బోగి నుంచి పొగలు వస్తు న్నాయి.. మరో వైపు సిబ్బంది అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు.. కొందరు రక్తం కారు తున్న ప్రయాణికులు కిందకు దించు తుంటే.. మరికొందరు కట్టుకడుతున్నారు.. ఇం కొందరు అం బులెన్స్‌లు ఎక్కించి ఆసుపత్రికి తరలిస్తు న్నారు..ఇంకో వైపు రైల్వే సిబ్బంది బోగీ పరిరక్షణ చర్యల్లో ఉన్నారు. బుధవారం ఉద యం 11 గంటలకు రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌ వద్ద ఒక భయానక వాతావరణం సృష్టించారు.స్థానికులంతా ఏదో జరిగిందని అను కుంటున్నారు. .కంగారుపడుతు న్నారు.. చివరికి ఇదంతా కోల్‌ సైడింగ్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌పీ ఎఆర్‌ఎంవీ సిబ్బంది మాక్‌ డ్రిల్‌ అని తెలియ డంతో ఊపిరిపీల్చుకున్నారు. రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో ఎంత వేగంగా స్పందిస్తాం అనే దానిని సమర్థవం తంగా చేసి చూపినట్టు ఏడీఆర్‌ఎం ఆపరేషన్స్‌ శ్రీనివాస కొండ తెలి పారు. రైలు ప్రయాణాన్ని చేసేట ప్పుడు ప్రయాణికులు చేయవలసిన , చేయకూడని పనులు వివరించారు.జేసీ చిన్ని రాముడు మాట్లా డుతూ ప్రమాదాల సమ యంలో ఎంత వేగంగా స్పందిస్తే అంత తక్కువ సంఖ్యలో ప్రజలను రక్షిం చవచ్చని చెప్పారు. 100 మంది రైల్వే సిబ్బంది, రెస్క్యూ బృందాలు మాక్‌డ్రిల్‌లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, డాక్టర్‌ ఎం.సుజీ, సీనియర్‌ డీఎస్‌వో బి.ప్రశాంత కుమార్‌, సీనియర్‌ డీఎంఈ ఏ.సంజయ్‌, డీఈ ఎన్‌ నార్త్‌ సిహెచ్‌ గోతం, డీసీఎం ఎండి అలీఖాన్‌, డీఈఈ గురు శ్రీనివాస్‌, డీఎస్‌టీఈ జె.నారాయణరావు ,ఏడీఎంఈ సీఎన్‌డబ్ల్యూ డిఆర్‌ రాజేష్‌, ఏడియన్‌ ముత్యాలరావు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ ,రాజీబ్‌ దర్పియా ఎస్‌సీఆర్‌ కెఎల్‌ఎన్‌ స్వామి, సివిల్‌ డిఫెన్స్‌ ఎస్‌సీఆర్‌ డీవై కంట్రోలర్‌ టి.సుధీర్‌బాబు, వి.కళ్యాణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:09 AM