ధాన్యం కొనుగోలు కేంరద్రం తనిఖీ
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:21 AM
ద్రాక్షారామ పీఏసీసీఎస్ పరిధిలో రైతు సేవా కేం ద్రాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టరు టి.నిషా ంతి తనిఖీ చేశారు.
ద్రాక్షారామ, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ద్రాక్షారామ పీఏసీసీఎస్ పరిధిలో రైతు సేవా కేం ద్రాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టరు టి.నిషా ంతి తనిఖీ చేశారు. నమూనాలు తీసే విధానాన్ని జెసీ పరిశీలించారు. రైతు సేవా కేంద్రం పనితీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విధానంపై సిబ్బందిని అడి గారు. సేవా కేంద్రం వద్ద రైతు నుంచి ధాన్యం మిల్లుకు రవాణా చేయించారు. కార్యక్రమంలో జేసీ వెంట ఆర్డీవో దేవరకొండ అఖిల, మండల వ్యవసాయాధికారి ఎన్.సత్యప్రసాద్, పీఏసీసీఎస్ సీఈవో పెంకె సత్యనారాయణ, వ్యవసాయ సహాయకులు సీహెచ్ రాజ్‌కుమార్, ఆర్.హేమంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రైతు కోరిన మిల్లుకే ధాన్యం : జేసీ
కె.గంగవరం: రైతు కోరిన మిల్లుకే ధాన్యం పంపించే ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలి పారు. శుక్రవారం కుందూరు గ్రామం లో ఆర్‌ఎస్‌కే ద్వారా ఽధాన్యం కొనుగోలు పరిశీలించారు. ట్రాక్టర్‌కు ఉన్న జీపీఎస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారు. ధాన్యం నాణ్యత పరిశీలించే టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఆపరేటర్, ట్రాన్స్‌పోర్టు మోనటరింగ్ అధికారి, కస్టోడియల్ అధికారులు ఎలా పని చేస్తున్నారో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు లతో జేసీ మాట్లాడారు. కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల, వ్యవ సాయశాఖ ఏడీఏ ఏవీఎస్ రంగారావు, ఏవో బలుసు రవి, డిప్యూటీ తహశీల్దార్ శ్రీరామ్ ప్రసాద్, వీఏఏ పావని, సివిల్ సప్లైస్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 01:21 AM