ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుంగిన రోడ్డు.. మూసుకుపోయిన సాగునీటి తూర

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:19 AM

నరేంద్రపురం శివారు బూరుగుగుంట వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డు కుంగిపోయి మధ్యలో గొయ్యి ఏర్పడింది.

పి.గన్నవరం, సెప్టెంబరు 15: నరేంద్రపురం శివారు బూరుగుగుంట వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డు కుంగిపోయి మధ్యలో గొయ్యి ఏర్పడింది. దీంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుందాలపల్లి డ్యామ్‌ నుంచి వచ్చిన పంటకాల్వ దిగువున ఉన్న వరి చేలకు సాగునీరు అందిస్తుంది. నరేంద్రపురం నుంచి వచ్చిన పంట కాల్వ బూరుగుగుంట వద్దకు వచ్చే సరికి ప్రధాన రోడ్డు మార్గంలో ఇవతలి వైపు పంట పొలాలకు రోడ్డు క్రింది నుంచి సిమెంట్‌ తూరలు ద్వారా సాగునీటిని పంపిస్తున్నారు. అయితే రోడ్డు అభివృద్ధి పనుల్లో సైతం ఈప్రదేశంలో కల్వర్టు ఏర్పాటు చేయలేదు. దీంతో భారీ వాహనాల రాకపోకలతో తూరలు ధ్వంసమై రోడ్డు క్రుంగిపోయింది. దీంతో తూరల్లో మట్టి కూరుకుపోవడంతో సాగునీరు ఇవతలి వైపునకు రావడం లేదు. పంటకాల్వ పరిధిలో ఉన్న 200 ఎకరాల వరి పొలాలకు సాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. గొయ్యి ఏర్పడిన చోట స్థానికులు ఎర్రజెండా, కొబ్బరి ఆకులతో ప్రమాద సూచిక ఏర్పాటు చేశారు. స్థానిక ఎంపీటీసీ పప్పుల సాయిబాబు తూరలో కూరుకుపోయిన మట్టిని ఎక్స్‌క వేటర్‌ సాయంతో తొలగించి సాగునీటికి ఇబ్బంది లేకుండా కొంతమేర పరిష్కారం చూపారు.

Updated Date - Sep 16 , 2024 | 12:19 AM

Advertising
Advertising