ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల గుంతల పూడ్చివేత

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:16 AM

కాకినాడ క్రైం, సెప్టెంబరు 1: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పాడైపోయి గుంతలుగా మారడం.. ఇందు లో వాహనదారులు పడి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు, ప్రమాదాలను గుర్తించిన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రమాదాల నివారణకు కృషి చేయా

పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వనమాడి

ఎస్పీ చొరవతో ముందుకొచ్చిన జేపీ కనస్ట్రక్షన్‌

కాకినాడ క్రైం, సెప్టెంబరు 1: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పాడైపోయి గుంతలుగా మారడం.. ఇందు లో వాహనదారులు పడి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు, ప్రమాదాలను గుర్తించిన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జేపీ కనస్ట్రక్షన్స్‌ నిర్వాహకులు జె.ప్రభాకర్‌, పీడీ రామకృష్ణను కోరారు. ఎస్పీ సూచన మేరకు జేపీ కనస్ట్రక్షన్స్‌ ముందుకొచ్చి ఆదివారం లారీపై సిమెంటు, ఇసుక, కంకర తీసుకువచ్చి రోడ్ల మధ్యలో ఉన్న గుంతలను పూడ్చించే కార్యక్రమం చేపట్టారు. కాకినాడ ఎస్‌డీపీవో రఘవీర్‌ విష్ణు పర్యవేక్షణల ట్రాఫిక్‌ సీఐ ఎన్‌.రమేష్‌, 1,2 పీఎస్‌ అధికారులు, సిబ్బంది సహకారంతో అచ్చంపేట జంక్షన్‌, ఆనంద్‌ థియేటర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, బలరాంహోటల్‌, న్యూబ్రిడ్జి సెంటర్‌, జగన్నాథపురం ఓల్డ్‌ బ్రిడ్జి, చంద్రిక థియేటర్‌వద్ద రోడ్ల మధ్యలో ఏర్పడిన గుంతలను పెద్ద సిమెంట్‌ కాంక్రీట్‌ లారీ లోడు తీసుకువచ్చి సిబ్బంది గోతులను పూడ్చివేశారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రోడ్డు గుంతల పూడ్చివేత పనులను పరిశీలించి జేపీ కనస్ట్రక్షన్‌ నిర్వాహకులు, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను అభినందించారు. రోడ్డు గుంతలు పూడ్పించేలా చర్యలు తీసుకున్న ఎస్పీ, ట్రాఫిక్‌ పోలీసులను వాహనదారులు, ప్రయాణికులు అభినందనలు తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 12:16 AM

Advertising
Advertising