రుడా అక్రమాలపై.. కొరడా తీస్తారా!
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:05 AM
కట్టేసుకో తర్వాత చూద్దాం..లేఅవుట్ వేస్తా వేసేసుకో..మనల్ని అడిగేవాడెవడు..గత ఐదే ళ్లలో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ (రుడా)లో ఇదీ పరిస్థితి.
ఇష్టానుసారంగా అనుమతులు
నిబంధనలు మీరి కట్టడాలు
విచ్చలవిడిగా లేఅవుట్లు
మారని అధికారుల తీరు
కూటమి రాకతో బెంబేలు
కొత్త చైర్మన్ బీవీఆర్‌కు సవాళ్లు
రాజమహేంద్రవరం సిటీ,నవంబరు 14 (ఆం ధ్రజ్యోతి) : కట్టేసుకో తర్వాత చూద్దాం..లేఅవుట్ వేస్తా వేసేసుకో..మనల్ని అడిగేవాడెవడు..గత ఐదే ళ్లలో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ (రుడా)లో ఇదీ పరిస్థితి. రుడా పాలన గత ఐదేళ్లలో అనేక అవినీతి అక్రమాలతో సాగిందనే విమర్శలు అనేకం అప్పటి ప్రతిపక్షం ప్రస్తు త అధికార పక్షం నుంచి వ్యక్తమయ్యాయి. రుడా పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి మొదలుకొని విభజిత జిల్లా వరకు కోట్లాది రూపాయల వెచ్చించి పనులు చేశారు.ఆయా పనుల్లో అవినీతి అక్రమాలు జరిగినట్టు గతంలో గొంతుచించుకున్నా వాస్తవాలు బయటకురాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రుడా వైస్ చైర్మన్‌గా ఉన్న అధికారినీ బదిలీ చేశారు.కానీ పాతనీరంతా కార్యాలయంలోనే ఉంది.ఆ ప్రక్షాళన కాలేదు. దీం తో పాత వాసనలు పోలేదు. ఇప్పటికీ పనితీరు అప్పటిలాగే ఉందనేది పలువురి మాట.
జిల్లాలో అక్రమ కట్టడాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొదలు కొని నూతన జిల్లా నిడదవోలు వరకు రూడా పరిధిలో అనేక అక్రమ కట్టడాలు, అనధికార లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అవినీతి అక్ర మాలకు కేరాఫ్ అడ్రస్‌గా గత పాలకులు ఉం డడంతో పరిస్ధితి దారుణంగా మారిపోయింది. జిల్లాలో రాజానగరం పరిధిలో కోరుకొండ, గాడా ల, బూరుగుపూడి, పాలచర్ల, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల పరిధిలో కొంతమూరు, కోలమూరు, కాతేరు, వెంకటనగరం,హుక్కుంపేట,బొమ్మూరు-కేశవరం రోడ్డు తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున అనధికార లేఅ వుట్లు పుట్టుకొచ్చాయి. కొన్ని కొర్రీలు,అప్రూవల్‌కు సాధ్యం కాని అడ్డంకులు ఉన్నవాటికి సైతం కళ్ళుమూసుకుని అప్రూవల్ చేసేశారు.దీని వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.అప్పటి అధికారులు, పాలకులు కుమ్మకై పంచుకున్నారనే ప్రసారం పెద్దఎత్తున సాగింది.ఈ లెక్కలు ఎలా తేలుస్తారో చూడాలి.
రుడా సీటుకు ఎదురుచూపులు..
కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అందరి దృష్టి రుడాపైనే పడింది. కొంత మంది అధికారులు రుడాకు వెళ్లడానికి పెద్దఎత్తున పైరవీలు కూడా చేశారు. కానీ ఫలించక వెనుదిరిగారు. కట్టడాలు,లేఅవుట్లు విషయంలో రుడా అప్రూవల్ కీలకం కావడం వల్ల ప్రస్తుతం రుడా సీట్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికీ పైరవీలు సాగుతూనే ఉన్నాయి.
నూతన చైర్మన్ బీవీఆర్‌కు సవాళ్లు
అవినీతి అక్రమాలతో నిండి ఉన్న రుడాను గాడిన పెట్టడంలో నూతన చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సిఉంది. అక్రమ కట్టడాలు, అప్రూవల్స్ మాటున జరిగిన అక్రమాలు, అనుమతులకు మించి జరిగిన నిర్మాణాల అంశాలు ఉన్నాయివాటి విషయమై ఎలా స్పందిస్తారో, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నవారిపై ఆయన వైఖరి ఎలావుంటుందనే దానిపై ఉత్కంఠం ఉంది. రుడాకు సంబంధించి కొంత డేటాపై చైర్మన్ అవగాహన తెచ్చుకుని రుడాలో గతంలో జరిగిన పనులకు చేసిన ఖర్చులపై ఆరా తీస్తే బండారం బయట పడుతుంది. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక రుడా నుంచి చేపట్టిన అభివృద్ధి పనులపై, ఇప్పటికే అక్రమంగా నిర్మాణాలు చేసిన వారిపైన చర్యలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.
చంద్రబాబును కలిసిన బీవీఆర్
రాజమహేంద్రవరం అర్బన్ డవలప్‌మెంట్ ఆధారీ (రుడా) చైర్మన్‌గా నియమితులైన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి , రాజానగరం నియోజకవర్గ టిడీపీ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్యమంత్రిచంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అమవరాతి అసెంబ్లీకి వెళ్లిన బీవీఆర్ చౌదరి సీఎం చంద్రబాబుకు మొక్కను అందించి ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Nov 15 , 2024 | 01:05 AM