ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prasadam Row: ప్రసాదంలోనూ.. గీ..కుడేనా!?

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:44 AM

అన్నవరం దేవస్థానానికి సరఫరా అవుతోన్న లక్షల కిలోల నెయ్యి మంచిదేనా..? లక్షలాది మంది భక్తులు ఇష్టంగా తినే ప్రసాదంలో పూర్తిగా నెయ్యి నాణ్యత పాటిస్తున్నారా..? ఆల యానికి సరఫరా అవుతోన్న నెయ్యి గడచిన రెండేళ్లుగా ఒకే కంపెనీ నుంచే ఎందుకు వస్తోంది.. ఆరునెలలకోసారి టెండ ర్లు పిలుస్తుండగా.. ప్రతిసారీ అదే కంపెనీకి కాంట్రాక్టు ఎలా దక్కుతోంది.. అదే కంపెనీ సింహాచలం దేవస్థానానికి..

Ghee

  • ఒకే కంపెనీ.. ధరలో మాత్రం భారీ వ్యత్యాసం

  • అన్నవరం దేవస్థానంలో నెయ్యి మాయాజాలం

  • రెండేళ్లుగా ఒకే కంపెనీ నుంచి నెయ్యి కొనుగోలు

  • నాలుగు సార్లు టెండర్లు.. ఒకే కంపెనీకి కాంట్రాక్టు

  • గతంలో విజయ డెయిరీ నుంచి కొనుగోలు

  • వైసీపీలో అనామక కంపెనీ నుంచే సరఫరా

  • ఏటా 1.80 లక్షల కిలోల నెయ్యి అవసరం

  • రెండేళ్లలో రూ.7.76 కోట్ల నొక్కుడు

తిరుపతి దేవస్థానానికి సరఫరా అవుతున్న నెయ్యిలో చేప నూనె, జంతు కొవ్వు అవశేషాలు బయటపడి సంచలనం సృష్టిస్తోంది.. తిరుపతి ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.. అటువంటిది అక్కడే కల్తీ జరిగిందంటే మిగిలిన ఆలయాల మాటేంటి ఇదీ ప్రతీ భక్తుడిని తొలుస్తున్న ప్రశ్న. మన జిల్లాలో అన్నవరం ప్రసాదానికి మహా డిమాండ్‌.. ప్రతి ఏటా లక్షలాది కిలోల నెయ్యి వినియోగిస్తారు. అటువంటిది అన్నవరం ఆలయానికి సరఫరా అవుతోన్న నెయ్యిపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీసింది. దీంతో ఈ నెయ్యి బండారం బయటపడింది. ఒకే కంపెనీ అన్నవరం దేవస్థానానికి.. సింహాచలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తోంది.. అన్నవరంలో కిలో నెయ్యికి రూ.538 వసూలు చేస్తుంటే.. అదే కంపెనీ సింహాచలంలో మాత్రం కిలో రూ.344 వసూలుచేయడం గమనార్హం. నేతలు, అధికారుల అండదండలతో కాంట్రాక్టరు గీకుడుకి అడ్డు లేకుండాపోయింది.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): అన్నవరం దేవస్థానానికి సరఫరా అవుతోన్న లక్షల కిలోల నెయ్యి మంచిదేనా..? లక్షలాది మంది భక్తులు ఇష్టంగా తినే ప్రసాదంలో పూర్తిగా నెయ్యి నాణ్యత పాటిస్తున్నారా..? ఆల యానికి సరఫరా అవుతోన్న నెయ్యి గడచిన రెండేళ్లుగా ఒకే కంపెనీ నుంచే ఎందుకు వస్తోంది.. ఆరునెలలకోసారి టెండ ర్లు పిలుస్తుండగా.. ప్రతిసారీ అదే కంపెనీకి కాంట్రాక్టు ఎలా దక్కుతోంది.. అదే కంపెనీ సింహాచలం దేవస్థానానికి కిలో నెయ్యి రూ.344కి సరఫరా చేస్తుంటే అన్నవరంలో మాత్రం కిలో రూ.538 ఎలా వసూలు చేస్తోంది. ఏటా దేవస్థానానికి 1.80 లక్షల కిలోల నెయ్యి అవసరమైతే అంత భారీ నెయ్యి ఒక డీలర్‌ ఎలా సరఫరా చేయగలుగుతున్నాడు. మార్కెట్లో లభ్యమయ్యే నాణ్యమైన నెయ్యి ధరకు.. దేవస్థానానికి సర ఫరా చేసే ధరకు ఇంత వ్యత్యాసం ఉంటే.. మరి ఆలయానికి వచ్చే నెయ్యిలో అంత నాణ్యత ఉంటుందా? ఇలా ఎన్నో సం దేహాలు భక్తుల నుంచి ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.


నాణ్యతపై అనుమానాలెన్నో...

వాస్తవానికి స్వచ్ఛమైన నాణ్యతతో కూడిన కిలో ఆవు నెయ్యి రూ.వెయ్యి వరకు పలుకుతోంది. ఆలయాలకు మాత్రం కాంట్రాక్టర్లు సగం ధరకే సరఫరా చేస్తుండడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల కిలోల్లో సరఫరా కాబట్టి కాస్త బల్క్‌గా ధర తగ్గిందనుకున్నా ఏదో పేరొందిన డెయిరీలు మాత్రమే ఆ స్థాయిలో నెయ్యి సర ఫరా చేయగలవు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత వరుసగా రెండేళ్లపాటు ఒకే కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కంపెనీ తరపున ఓ డీలరు ఇంత భారీ నెయ్యిని ఎలా సరఫరా చేస్తున్నాడనే దానిపై అనుమానాలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే రోజుకు దాదాపు 496 కిలోల నెయ్యి ఆలయానికి సర ఫరా చేయడం అసాధ్యం. పైగా ఒక కిలో ఆవు నెయ్యి తయారవ్వాలంటే సరాసరి 30 లీటర్లకుపైగా పాలు అవసరం. మరి ఈ స్థాయిలో నెయ్యి తయారు చేసి సర ఫరా చేయడం సాధారణ కాంట్రాక్టర్‌కు సాధ్యం కాదు. వేర్వేరు ప్రాంతాల నుంచి సేకరించి మిక్స్‌ చేసే అవకా శాలున్నాయి. దేవస్థానం ఈ నెయ్యి నాణ్యతను ఎంత వరకు సమర్థవంతంగా పరీక్షిస్తుందనేదానిపై సందేహా లు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు నెయ్యి నాణ్యతను పరీక్షించాల్సి ఉండగా, వైసీపీ పెద్దల సిఫారసు చేసిన కాం ట్రాక్టరు కావడంతో అధికారులు ఇదేదీ పెద్దగా పట్టించుకోవ డం లేదు. తాజాగా తిరుపతి దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యి వివాదాస్పదమైన నేపథ్యంలో ఇక్కడకు సరఫరా అవు తోన్న నెయ్యిపై ఇక నుంచి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


2 కోట్ల ప్యాకెట్లు అమ్మకం..

అన్నవరం దేవస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం. ఏటా లక్షలాది మంది భక్తులు ఆలయానికి వస్తుం టారు. ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడు ఎంతో ఇష్టంగా అన్నవరం ప్రసాదాన్ని తింటారు. ఏటా రెండు కోట్ల వరకు ప్రసాదం ప్యాకెట్లు అమ్ముడవుతాయి. ఈ ప్రసాదం తయారీలో నెయ్యి కీలకమైనది. దీని నాణ్యతపైనే ప్రసాదం రుచి ఆధారపడి ఉం టుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే కంపెనీ గడచిన రెండేళ్లుగా నెయ్యి సరఫరా చేస్తోంది. ఈ నెయ్యి ధరపై అనేక అనుమానాలు ఉన్నాయి.


రెండేళ్లు..4 టెండర్లు.. ఒకరికే..

అన్నవరం ఆలయానికి ఏటా 1.80 లక్షల నుంచి రెండు లక్షల కిలోల వరకు నెయ్యి అవసరం. ఈ నెయ్యి కొనుగోలు కోసం దేవస్థానం సెంట్రల్‌ స్టోర్స్‌ విభాగం ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. ఎవరు తక్కువ ధర కోట్‌ చేస్తే వారికే అప్పగిస్తుంది. 2022 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు టెండర్లు పిలవగా వరుసగా ఒకే కంపెనీ పేరుతో టెం డర్‌లో పాల్గొంటున్న ఓ డీలర్‌కే ఈ కాంట్రాక్టు దక్కుతుండ డం అనుమానాలకు తావిస్తోంది. సదరు కాంట్రాక్టర్‌ కోట్‌ చేసి న ధర ఇతర ఆలయాలకంటే ఎక్కువగా ఉన్నా అధికారులు ఇదేదీ పట్టించుకోలేదు. ఈమేరకు అధికారంలో ఉన్న సమ యంలో కొందరు వైసీపీ పెద్దలు పావులు కదపడం విశేషం.


గడచిన రెండేళ్లుగా సదరు డీలరు దేవస్థానానికి కిలో నెయ్యి 2022 అక్టోబరు నుంచి 2023 మార్చి వరకు కిలో రూ.498 చొప్పున, 2023 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు కిలో రూ.564 చొప్పున, 2023 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు రూ.540, 2024 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు రూ.538.60 చొప్పున సరఫరా చేస్తున్నాడు. సింహాచలం దేవ స్థానానికి మాత్రం ఇదే కంపెనీ కిలో నెయ్యి రూ.344 చొప్పున సరఫరా చేస్తోంది. దీన్నిబట్టి అన్నవరం ఆలయానికి సరఫరా చేసే నెయ్యి ధరలో ఎంత పిండేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ధరతో పోల్చితే ఈ రెండేళ్లలో దేవస్థానానికి రూ.7.76 కోట్లు నష్టం వాటిల్లినట్టు లెక్క. తిరుపతిలాంటి దేవస్థానానికి కిలో నెయ్యి రూ.411కి సరఫరా కాగా ఇక్కడ మాత్రం ధరలో వ్యత్యా సం ఉండడం విశేషం. వాస్తవానికి జగన్‌ సర్కారు రాక ముందు అన్నవరం దేవ స్థానానికి సంగం, విజయలాంటి పేరొందిన డెయిరీల నుంచి నెయ్యి వచ్చేది. కమీషన్ల కక్కుర్తితో వైసీపీ 2022 నుంచీ ఊరు పేరు లేని కంపెనీని తెరపైకి తెచ్చి నెయ్యి సరఫరా చేయిస్తుండడం విశేషం.


ఇవి కూడా చదవండి:

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 21 , 2024 | 01:17 PM