డిమాండ్‌కు అనుగుణంగా ఇసుక సరఫరా చేయాలి
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:51 AM
డిమాండ్‌కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఇసుక తవ్వకాలు నిర్వహించే కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం రావులపాలెం మండలం ఊబలంక ఆర్‌ఎస్‌ఆర్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఇసుక స్టాకు పాయింట్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్దేశించిన మేరకు ఇసుక తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అమలాపురం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): డిమాండ్‌కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఇసుక తవ్వకాలు నిర్వహించే కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం రావులపాలెం మండలం ఊబలంక ఆర్‌ఎస్‌ఆర్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఇసుక స్టాకు పాయింట్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్దేశించిన మేరకు ఇసుక తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఊబలంక ఇసుక ర్యాంపు నుంచి సుమారు 64,800 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చామన్నారు. ప్రతీరోజు 500 మెట్రిక్ టన్నుల మేర ఇసుకను తవ్వి వినియోగదారులకు అందుబాటులో ఉంచే విధంగా సంబంధిత ఏజెన్సీలను ఆదేశించామన్నారు. స్టాకు పాయింట్ వద్ద రేయింబవళ్లు ఇసుక కార్యకలాపాలు జరిగేలా ఏజెన్సీలు చూడాలన్నారు. ఇసుక ర్యాంపు వద్ద మాత్రం నిర్దేశించిన సమయంలోనే తవ్వకాలు జరగాలన్నారు. ఇసుక అవసరమైన వారందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ మహేష్‌కుమార్ ర్యాంపు నుంచి స్టాకు పాయింట్‌కు ఎంత ఇసుక వస్తుంది, ఎంతమేర వినియోగదారులకు అందిస్తున్నారో రికార్డులను పరిశీలించారు. ఇసుక లోడింగ్, రవాణా పరంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని ఏజెన్సీలు, అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. రావులపాలెం తహశీల్దార్ ఎం.ముక్తేశ్వరరావు, మైన్స్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 12:51 AM