ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారదర్శకంగా ఇసుక పాలసీ

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:58 AM

ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లకు సూచించారు. అమరావతి నుంచి చంద్రబాబు గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఇసుక నిర్వహణ వ్యవస్థపై నూతనంగా రూపొందించిన ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు.

హాజరైన ఎమ్మెల్యే రాజప్ప, కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 19: ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లకు సూచించారు. అమరావతి నుంచి చంద్రబాబు గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఇసుక నిర్వహణ వ్యవస్థపై నూతనంగా రూపొందించిన ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. అక్టోబరు 15 నుంచి పూర్తి స్థాయిలో రీచ్‌లల్లో, యార్డుల్లో డిమాండ్‌కు సరిపడా ఇసుక అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్చలు తీసుకుంటున్నామన్నారు. ఇసుక పారదర్శకంగా లభిస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించాలని ఆయన సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో జి.కేశవర్థనరెడ్డి, డీఆర్డీఏ పీడీ డాక్టర్‌ వి.శివశంకరప్రసాద్‌, డీపీవో దిడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 12:58 AM