ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వంగలపూడి -1,2 రీచ్‌ల అనుమతులు రద్దు

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:06 AM

వంగలపూడి 1,2 ఇసుక రీచ్‌లు రద్దుచేస్తున్నట్టు జేసీ చినరాముడు ప్రకటించారు. వంగలపూడ ఇసుక ర్యాంపు వద్ద స్థానికులకు, యాజమాన్యానికి మధ్య ధరల విషయమై గొడవ జరిగిన నేపథ్యంలో బుధవారం జేసీకి వాట్సాప్‌ మెసెజ్‌ల ద్వారా ఫిర్యాదులు చేశారు.

వంగలపూడి రీచ్‌ వద్ద మాట్లాడుతున్న జేసీ చినరాముడు

సీతానగరం,నవంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి) : వంగలపూడి 1,2 ఇసుక రీచ్‌లు రద్దుచేస్తున్నట్టు జేసీ చినరాముడు ప్రకటించారు. వంగలపూడ ఇసుక ర్యాంపు వద్ద స్థానికులకు, యాజమాన్యానికి మధ్య ధరల విషయమై గొడవ జరిగిన నేపథ్యంలో బుధవారం జేసీకి వాట్సాప్‌ మెసెజ్‌ల ద్వారా ఫిర్యాదులు చేశారు.ఓపెన్‌ రీచ్‌ పాయింట్‌ వద్ద వంగలపూడి-1 నుంచి టన్ను ఇసుక ధర రూ 67.59లు వంగలపూడి-2 వద్ద టన్ను రూ 70.19 లుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తు తం రీచ్‌ వద్ద రూ.200లు నుంచి రూ.400ల వరకు విక్రయిస్తున్నారని వచ్చిన అభియోగాల మేరు మెసర్సు పాన్‌ ఇండియా ప్రాజెక్స్ట్‌ వారి అనుమతి ఉత్తర్వులను రద్దుచేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఆర్డర్లు పొందిన లారీలకు స్టాక్‌ పాయింట్‌ వద్ద అందుబాటులో ఉన్నంత వరకు ఇసుక ఇవ్వడం జరుగుతుందని తదుపరి రీచ్‌ మూసివేస్తామన్నారు. ప్రజలు ,ప్రజాప్రతినిధులు వాట్సాప్‌ మెసేజ్‌లు చేస్తున్నారని తీరా ఆరా తీస్తుంటే చెప్పడం లేదని దీనివల్ల సరైన చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు. లారీ డ్రైవర్లకు మొబైల్‌ స్లిప్పులు అను శీర్షికన ఏం జరుగుతోందో అంటూ ముందుగానే ఆంధ్రజ్యోతి తెలియజేయడం జరిగింది. దీనిని బలపరుస్తూ బుధవారం స్థానికులు వంగలపూడి ఇసుక రీచ్‌ వద్ద గుట్టు రట్టు చేశారు.దీంతో ఇసుక రీచ్‌ మూతపడింది.ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ కృష్ణనాయక్‌, మైన్స్‌ టెక్కికల్‌ అసిస్టెంట్‌ శైలజ ,వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌ నారాయణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:06 AM