ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక తీతకు రెడీ!

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:31 AM

ఉచిత ఇసుక సరఫరాకు అధికార యంత్రాం గం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఇసుక కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో వెంటనే ఇసుక తీత మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇసుక

40 బోట్స్‌మన్‌ సొసైటీలు ఒకే

నేడు మరో 8 సొసైటీలకు అనుమతి

రేపోమాపో కలెక్టర్‌ ఉత్తర్వులు

ఈ లోపు ఆగని దొంగలు

లారీ రూ.30 వేల వరకూ అమ్మకం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఉచిత ఇసుక సరఫరాకు అధికార యంత్రాం గం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఇసుక కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో వెంటనే ఇసుక తీత మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అఽధికారులు అఖండగోదావరి పరిధిలోని ధవళేశ్వరం బ్యారేజి నుంచి గోదావరి నాల్గో బ్రిడి ్జ(గామన్‌) వరకూ 9 డీసిల్టేషన్‌ పాయింట్లను గుర్తించారు. ఈ పాయింట్లలో ఇసుక తీయడానికి మొత్తం 48 బోట్స్‌మన్‌ సొసైటీలను గుర్తించారు. అందులో 40 సొసైటీలకు ఇప్పటికే అనుమతి రాగా శనివారం మరో 8 సొసైటీల ఖరారు చేసి, మొత్తం 48 సొసైటీలకు ఇసుక తీత బాధ్యతను అప్పగించనున్నారు.ఈ మేరకు రేపోమాపో జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. గాయత్రీ, కోటిలింగాల మూడు పాయింట్లు, కొవ్వూరు వైపు వాడపల్లి , ఔరంగాబాద్‌ తదితర ప్రాంతాలలో 6 డీసిల్టేషన్‌ పాయింట్లు గుర్తించారు. ఒకట్రెండు రోజుల్లో ఇసుక తీత మొదలవుతుంది. బోట్స్‌మన్‌ సొసైటీలను ఎంపిక చేశారే కానీ.. టన్ను ఇసుక తీతకు ఎంతిస్తారు. ఎన్నిరోజుల్లో సొమ్ము ఇస్తారు. అది ఎవరు ఇస్తారనే విషయాలలో స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది.

ఆగని ఇసుక దొంగలు

ఇసుక కొరత విపరీతంగా ఉన్నందున ఇసుక దొంగలు బయలు దేరారు. పేపరుమిల్లు వెనుక వైపు ఓ సొసైటీ నిర్వాహకులు గోదావరిలో అక్ర మంగా ఇసుక తవ్వి ఒడ్డుకు తేవడంతో అధికా రులు పట్టుకున్నారు. ఈ విషయంలో చర్యలు ఏమి తీసుకున్నారో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.మరో పక్క గతంలో కాతేరులో ఓ లేఅవు ట్‌లో సీజ్‌ చేసిన ఇసుకకు ఎవరు అనుమతి చ్చారో తెలియదు కానీ అక్రమంగా అమ్మేస్తు న్నారు. లారీ రూ.30 వేల వరకూ విక్రయిస్తున్నా రు. ఫోర్త్‌ బ్రిడ్జి నుంచి దివాన్‌చెరువు వచ్చే రోడ్డులో ఆటోనగర్‌ ఎదురుగా గత ఒక పాయింట్‌ నుంచి ప్రతి రోజు రాత్రి 11 గంటల నుంచి ఇసుక అక్రమ అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం. కాతేరు నుంచి తొర్రేడు వైపు వెళ్లే రోడ్డులో ఓ విద్యాసంస్థ పరిసర ప్రాంతం నుంచి కూడా అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను విక్రయిస్తున్నా రు. టన్నుకు ఏకంగా రూ.1600 వసూలు చేస్తు న్నారు. ఇదంతా ప్రత్తిపాడు ప్రాంతానికి రవాణా చేస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పడం గమనార్హం.

Updated Date - Sep 21 , 2024 | 12:31 AM