ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక తరలింపు హక్కుల కోసం భారీగా టెండర్లు

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:03 AM

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకతీసి స్టాకు యార్డుకు తరలించేందుకు అమలాపురంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం టెండర్లను స్వీకరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని 12 ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను తీసి స్టాకు యార్డులకు తరలించేందుకు గత నెల 31వ తేదీన జిల్లా శాండ్‌ కమిటీ టెండర్లు స్వీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. వారం రోజులు వ్యవధి ఇచ్చి జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ గడువు గురువారం ముగియడంతో పెద్ద సంఖ్యలో టెండరుదారులు ఇసుక ర్యాంపుల కోసం తమ టెండర్లను బాక్సులో వేశారు.

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకతీసి స్టాకు యార్డుకు తరలించేందుకు అమలాపురంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం టెండర్లను స్వీకరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని 12 ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను తీసి స్టాకు యార్డులకు తరలించేందుకు గత నెల 31వ తేదీన జిల్లా శాండ్‌ కమిటీ టెండర్లు స్వీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. వారం రోజులు వ్యవధి ఇచ్చి జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ గడువు గురువారం ముగియడంతో పెద్ద సంఖ్యలో టెండరుదారులు ఇసుక ర్యాంపుల కోసం తమ టెండర్లను బాక్సులో వేశారు. భారీగా టీడీపీతో పాటు ఇతర కూటమి నాయకులు సిండికేట్లుగా మారి ఆ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పోటీపడ్డారు. పెద్ద సంఖ్యలో టెండరు షెడ్యూలు దాఖలైనట్టు అధికారులు చెబుతున్నప్పటికీ సమయాభావం ముగియడంతో ఒక్కసారిగా టెండరుదారులు పోటెత్తి బాక్సులోటెండర్లు వేశారు. దీంతో ఏయే ర్యాంపునకు ఎన్ని టెండర్లు దాఖలయ్యాయో అధికారులు సైతం నోట్‌ చేసుకోలేని పరిస్థితి. జిల్లాలో అంకంపాలెం, నార్కేడుమిల్లి, పులిదిండి, పొడగట్లపల్లి 2 ర్యాంపులు, వద్దిపర్రు 2 ర్యాంపులు, ఆలమూరు, ఊబలంక, తాతపూడి, కపిలేశ్వరపురం రెండు ర్యాంపులు, ఆత్రేయపురం, రావులపాలెం తదితర ర్యాంపులకు టెండర్లు భారీగా దాఖలయ్యాయి. కూటమి నేతలే సిండికేట్ల అవతారమెత్తి భారీగా టెండర్లు దాఖలు చేయడం ద్వారా ఇసుక కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుక ర్యాంపుల్లో బాట వేసి ర్యాంపు నుంచి ఇసుకను వాహనాల్లో లోడ్‌ చేసి ప్రభుత్వం నిర్దేశించిన స్టాక్‌ పాయింట్ల వద్దకు ఇసుకను తీసుకువెళ్లి అన్‌లోడింగ్‌ చేయాలి. ఆ తర్వాత అక్కడి నుంచి వినియోగదారుడు తీసుకువెళ్లేందుకు వీలుగా వాహనంలో ఇసుకను లోడ్‌ చేసేందకు నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ టెండర్లు పిలిచింది. జిల్లాలో ఇసుక వ్యాపారులు, రవాణాదారులు నుంచి మంచి స్పందన లభించడంతో వందల సంఖ్యలోనే టెండర్లు దాఖలైనట్టు తెలుస్తుంది. అయితే అందరూ వ్యూహాత్మకంగా సిండికేట్‌ అయి ఈ టెండర్లు దాఖలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Nov 08 , 2024 | 12:04 AM