షష్ఠి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి
ABN, Publish Date - Dec 06 , 2024 | 01:32 AM
ఏడిద సంఘమేశ్వరస్వామి ఆలయంలో రేపు జరిగే షష్ఠి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి.
మండపేట, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఏడిద సంఘమేశ్వరస్వామి ఆలయంలో రేపు జరిగే షష్ఠి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి. దక్షిణ కాశీగా ఈ ఆలయం పేరు గాంచింది. ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ని దర్శించుకుని పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. షష్ఠి సంద ర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభి షేకాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు సూర్యనారాయణ తెలిపారు. మండపేట పరి సర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవస రమైన అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణంతో పాటు మండపేట మండలంలో కూడా ఆయా ఆల యాల్లో షష్ఠి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Updated Date - Dec 06 , 2024 | 01:33 AM