ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు సత్యదేవుని తెప్పోత్సవం

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:27 AM

రత్నగిరివాసుడైన సత్యదేవునికి జరిగే వార్షిక వే డుకల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన స్వామివారి తెప్పోత్సవం నిర్వహణకు అధికారులు సర్వంసిద్ధం చేశారు. ప్రతిఏటా క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన ఈ వేడుక నిర్వహిస్తారు. ఇప్పటికే హంస వాహనాన్ని ముస్తాబు చేశారు. తులసిధాత్రి పూజ జరిపేందుకు పంపా తీరం వద్ద వేదికను సర్వాంగసుందరంగా అలంకరిస్తున్నారు.

సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న తులసిధాత్రి పూజ

రాత్రి ఏడు గంటలకు హంస వాహనంపై పంపా సరోవరంలో విహరించనున్న స్వామి, అమ్మవార్లు

ఏర్పాట్లు పూర్తి చేసిన అన్నవరం దేవస్థానం అధికారులు

అన్నవరం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవునికి జరిగే వార్షిక వే డుకల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన స్వామివారి తెప్పోత్సవం నిర్వహణకు అధికారులు సర్వంసిద్ధం చేశారు. ప్రతిఏటా క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన ఈ వేడుక నిర్వహిస్తారు. ఇప్పటికే హంస వాహనాన్ని ముస్తాబు చేశారు. తులసిధాత్రి పూజ జరిపేందుకు పంపా తీరం వద్ద వేదికను సర్వాంగసుందరంగా అలంకరిస్తున్నారు. సాయం త్రం 4.30 గంటలకు రత్నగిరిపై నుంచి స్వామి ,అమ్మవార్లను, క్షేత్ర పాలకులైన సీతారాములను మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కొండ దిగువున పంపా సరోవరం వద్దకు తోడ్కొనివచ్చి తులసిధాత్రి పూజ చేస్తారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లకు పంపా సరోవరంలో ముమ్మారు ప్రదక్షిణ గావిస్తారు. ప్రముఖులెవ్వరూ కాకుండా వైదిక బృందం మాత్రమే హంస వాహనం ఎక్కేందుకు చర్యలు చేపట్టారు. ప్రముఖులు వీక్షించేందుకు తీరం ఒడ్డున ప్రత్యేక వీఐపీ గ్యాలరీ ఏర్పాటుచేస్తున్నారు. రంగురంగుల విద్యుద్దీపాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా వచ్చే ప్రజలు ప్రత్యక్షంగాను, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులు పరోక్షంగాను వీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫైర్‌, అంబులెన్స్‌ వాహనాలు, గజ ఈతగాళ్ళు, లైఫ్‌ జాకెట్లను సిద్ధం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో సుమారు 100 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

సత్యదేవుని సన్నిధి కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రద్దీగా మారింది. తెల్లవారుజామున రెండు గంటల నుంచి వ్రతాలు, మూడు గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించారు. వేకువజామున నాలుగు గంటలకే స్వామివారి దర్శనానికి భక్తులు బారు లు తీరారు. సుమారు 6వేల జంటలు సత్యదేవుని వ్రతాలు ఆచరించుకోగా స్వామివారికి వివిధ విభాగాల ద్వారా రూ.65 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 30వేల మంది భక్తులకు ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నదాన విభాగం ఏఈవో బి.వెంకటరెడ్డి పర్యవేక్షణలో ఉచిత పులిహోర పంపిణీ చేశారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం భక్తులు క్యూలైన్లలో వేచియుండాల్సి వచ్చింది.

Updated Date - Nov 13 , 2024 | 12:27 AM