ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రకృతిని పరిరక్షించుకోవాలి

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:21 AM

ప్రకృ తిని పరిరక్షించుకొనే లక్ష్యంతోనే వన సమారాధ నలు నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే నల్ల మిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం దుప్పల పూడిలో కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో అధ్యక్షుడు కర్రి త్రినాథరెడ్డి అధ్యక్షతన వన సమారాధన నిర్వహించారు.

దుప్పలపూడిలో ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిని సత్కరిస్తున్న దృశ్యం

  • కార్తీక వన సమారాధనలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

అనపర్తి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రకృ తిని పరిరక్షించుకొనే లక్ష్యంతోనే వన సమారాధ నలు నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే నల్ల మిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం దుప్పల పూడిలో కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో అధ్యక్షుడు కర్రి త్రినాథరెడ్డి అధ్యక్షతన వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ రెడ్డి కు లంలో అనేకమంది మహానుభావులు జన్మించా రని, దానధర్మాలతో బాటు సమాజానికి అనేక సేవలందించారన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, చింత కుంట శ్రీని వాసరెడ్డి తదితరులు మాట్లా డారు. ప్రజాసేవలో రెడ్ల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురికి కూపన్లు అందించి డ్రా నిర్వహించి బహుమతులు అందజేశారు. ప్రముఖులను సత్కరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరిం చాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, నాయకులు తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి బులిరెడ్డి, తాడి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.

  • రాజమహేంద్రవరం కల్చరల్‌..

స్థానిక ఆంధ్ర కేసరి కళాశాలలో దుర్వాసన సత్యనారాయణ ఆధ్వర్యంలో నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వ ర్యంలో జరిగిన వన సమారాధనలో అధిక సంఖ్యలో బ్రా హ్మణులు పాల్గొన్నారు. సామూహికంగా భోజనం చేయడం జాతి సమైక్యతను తెలియజేస్తుందన్నారు. గైనకాలజిస్టు కె.లలితను సత్కరించారు. కార్యక్రమంలో కామేష్‌, హరిబాబు, మాదిరా శ్రీనివాస్‌, లక్ష్మీప్రసన్న, ప్రసాద్‌, కాత్యాయని పాల్గొన్నారు. అలాగే ది జాంపేట దేవాంగ సంఘం ఆధ్వర్యంలో తోకాడ లో కాలెపు గణేష్‌రాం, లలిత వారి తోటలో వన సమారాధన జరిగింది. పిల్లలకు, పెద్దలకు ఆటలపోటీలు నిర్వహించారు. తోట యజమానులను సత్కరించారు. సంఘ సభ్యులు నల్లా శంకరరావు, పూర్ణిమ ప్రసాద్‌, కొడమటి జగన్మోహనరావు, ఆకాశపు సాంబశివరావు, కేవీ అప్పారావు, నల్లా శివశంకర్‌ పాల్గొన్నారు. ఆధ్యర్యంలో జరిగింది.

Updated Date - Nov 11 , 2024 | 01:21 AM