ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కడలి కల్లోలం

ABN, Publish Date - Oct 18 , 2024 | 12:08 AM

రాకాసి అలలు తీరం వెంబడి అలజడి సృష్టిస్తున్నాయి.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. ఒక్కసారిగా అలలు బీభత్సం సృష్టించడంతో జియో ట్యూబ్‌ రాళ్ల కట్టుబడి దెబ్బతింది.

ఓడలరేవు సముద్ర తీరంలో కొట్టుకుపోయిన ఓఎన్జీసీ రివిట్‌మెంట్‌ రోడ్డు

ఓడలరేవు తీరంలోప్రమాద ఘంటికలు

తుఫాను ప్రభావంతో రాకాసి అలల బీభత్సం

అల్లవరం(ఆంధ్రజ్యోతి): రాకాసి అలలు తీరం వెంబడి అలజడి సృష్టిస్తున్నాయి.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. ఒక్కసారిగా అలలు బీభత్సం సృష్టించడంతో జియో ట్యూబ్‌ రాళ్ల కట్టుబడి దెబ్బతింది. ఓఎన్జీజీ రివిట్‌మెంట్‌ రోడ్డు కొట్టుకుపోయింది. ఓఎన్జీసీ ప్లాంటుకు సరైన రక్షణ లేక అలలతో ముప్పు వాటిల్లింది. ముందస్తుగా ఓడలరేవు, కొమరగిరిపట్నం తీర గ్రామాలకు ప్రమాద ఘంటికలు హెచ్చరిస్తున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఓడలరేవు, కొమరగిరి తీరంలో రక్షణ చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, ఓఎన్జీసీ ఉన్నతాధికారుల బృందం భయానకంగా తయారైన తీరంలో దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిస్మిక్‌ సర్వేలు, ఆన్‌ఫోర్‌, ఆఫ్‌ఫోర్‌ ఓఎన్జీసీ బావుల ద్వారా ముడిచమురు గ్యాస్‌ అపారంగా తీసివేయడంతో తీరంలో రెండు అడుగుల మేర భూమి కుంగిపోయి సుమారు కిలోమీటరు లోపలకు గడిచిన 20 ఏళ్లలో భూమి కొట్టుకుపోయి తీరంలో అలలు విరుచుకుపడుతున్నాయి.

కృష్ణా గోదావరి బేసిన్‌ పరిధిలో వేలాది కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ ప్లాంటుకు సముద్ర అలలతో ముప్పు వాటిల్లింది. ప్లాంటులోకి సముద్రపు చొచ్చుకు వచ్చి అలలు బీభత్సం సృష్టించాయి. ఓడలరేవు బీచ్‌ రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. రూ.12 కోట్లతో నిర్మించిన డ్రైనేజీ సిస్టం పూర్తిగా ధ్వంసమైంది. ఓఎన్జీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో తీరం వెంబడి పటిష్ట రక్షణ చర్యలు చేపట్టకుండా ఓఎన్జీసీ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. తీరంలో వెయ్యి ఎకరాల రైతు జిరాయితీ భూములు, 150 ఎకరాల అటవీశాఖ భూములు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఓడలరేవు గ్రామంలో కొందరు దళారీలు స్వలాభాపేక్షతో గ్రామాభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓఎన్జీసీ ప్రహరీ వెనుక సముద్ర కోత నుంచి రక్షణగా నిర్మించిన జియో ట్యూబ్‌ రాళ్ల కట్టడాలు కొట్టుకుపోయి ఆ ప్రాంతం భయానక పరిస్థితిని తలపిస్తుంది.

ఓడలరేవు తీరంలో సుమారు వంద ఎకరాల్లో రొయ్యల చెరువులకు గండ్లు పడి రొయ్య పంట కొట్టుకుపోయింది. ఓఎన్జీసీ గేటు వద్ద చిరు వ్యాపారి బంగారమ్మ బడ్డి అలల తాకిడికి కొట్టుకుపోయింది. సముద్ర తీరంలో ఆక్వా చెరువులతో పాటు ఇసుక తవ్వకాల వల్ల పెనుముప్పు వాటిల్లింది. ’గట్టు జారితే ఊరు గల్లంతే, ఓడలరేవు తీరంలో భారీగా భూమికోత, సముద్రపు అలలకు కొట్టుకుపోయిన రోడ్డు’ వంటి శీర్షికల్లో ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు వెలువడిన సంగతి విదితమే. ఇప్పటికైనా తీర గ్రామాలు, ఓఎన్జీసీ ప్లాంటు ఉనికి కోల్పోకుండా యుద్ధ ప్రాతిపదికన తీర ప్రాంతంలో పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు తీర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓఎన్జీసీ నిధులతో తీరం వెంబడి రక్షణ గోడ నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఎంపీ జి.హరీష్‌మాధుర్‌కు, ఎమ్మెల్యే ఆనందరావుకు జిల్లా కలెక్టర్‌, ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Oct 18 , 2024 | 12:08 AM