ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేమగిరి పంచాయతీలో విచారణ

ABN, Publish Date - Dec 04 , 2024 | 01:43 AM

వేమగిరి పం చాయతీ కార్యాలయంలో మంగళవారం కొవ్వూరు డీఎల్‌పీవో విచారణ చేపట్టారు.

రాజమహేంద్రవరంరూరల్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి) : వేమగిరి పం చాయతీ కార్యాలయంలో మంగళవారం కొవ్వూరు డీఎల్‌పీవో విచారణ చేపట్టారు.కడియం మండలం వేమగిరి గ్రామంలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ అదే గ్రామానికి చెందిన కె.సత్యనారాయణ ఈ ఏడాది జూలై 10వ తేదీన నేరుగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.2022లో అప్పటి గ్రామ కార్యదర్శి కే.రాజశేఖర్‌, డిప్యూటేషన్‌పై వచ్చిన బిల్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాస్‌ లక్షలాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాన్‌ అప్రూవల్‌కు రూ.10వేలు, ఇంటికి తక్కువ పన్నులు వేస్తామంటూ ఒక్కొక్క ఇంటికి రూ.5 వేలు, శానిటేషన్‌ తదితర పనులకు ఉపయోగించే దినసరి కార్మికులు ఒక్కొక్కరు నుంచి రూ.100, డ్రైనేజీ, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పను లు నాసిరకంగా చేస్తూ బిల్లులు చేయించుకున్నారని ఆరోపించారు. గ్రామ ంలో అవినీతిపై ఎంపీడీవో, డీఎల్‌పీవో, డీపీవోలకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేన్నారు.ఈ మేరకు మంగళవారం విచారణ చేపట్టారు. వేమగిరి గ్రామానికి అప్పటి ఎంపీడీవో కె.రత్నకుమారి ప్రత్యేకాఽధికారిగా ఉన్నారు. అయితే ఎటువంటి ఖర్చయినా ప్రత్యేకాధికారి తంబ్‌ వేస్తేనే బిల్లులు అవుతాయి.ఈ అవినీతిలో ఎవరిపై చర్యలు ఉంటాయో వేచి చూడాల్సిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వేమగిరి గ్రామానికి ప్రత్యేకాధికారిగా రాజమహేంద్రవరం మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ బాధ్యతలు చేపట్టారు. పాత పద్ధతినే సదరు కార్యదర్శి రాజశేఖర్‌ ఇష్టానుసారంగా లక్షలాది రూపాయల బిల్లులు పెట్టడంతో కేతన్‌గార్గ్‌ అనుమానం వ్యక్తం చేశారు.దీనిపై జిల్లా కలెక్టర్‌కు నివేదించగా.. జిల్లాస్థాయి అధికారిణి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్‌ ఆదేశాలిచ్చినట్టు తెలిసింది.

Updated Date - Dec 04 , 2024 | 01:43 AM