గీత కులాలకు కూటమి అధిక ప్రాధాన్యం
ABN, Publish Date - Dec 16 , 2024 | 01:07 AM
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గీత కులాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అధిక ప్రాధాన్యమిచ్చారని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం లాలాచెరువులో శెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, 15 మంది డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం, శెట్టిబలిజ వెన్నుదన్ను సభ శాసనమండలి
మంత్రి వాసంశెట్టి సుభాష్
రాజమహేంద్రవరంలో శెట్టిబలిజ వెన్నుదన్ను సభ
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గీత కులాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అధిక ప్రాధాన్యమిచ్చారని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం లాలాచెరువులో శెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, 15 మంది డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం, శెట్టిబలిజ వెన్నుదన్ను సభ శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్‌ఎస్) అధ్యక్షతన ఆదివారం రాత్రి జరిగింది. కుడుపూడి సత్తిబాబు, 15మంది డైరెక్టర్‌లతో ఆర్‌ఎస్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ శెట్టిబలిజ జాతి పిత దొమ్మేటి వెంక టరెడ్డి కాంస్య విగ్రహాన్ని రాజమహేంద్రవరం లాలాచెరువు సెంటర్‌లో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, వేమగిరి సెంటర్లో కూడా దొమ్మేటి విగ్రహాన్ని పెట్టుకుంటామన్నారు. గీత కులాలకు కూటమి ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 5నెలలోనే లిక్కర్ పాలసీలో 10శాతం రాయితీ ఇచ్చారన్నా రు. గత ప్రభుత్వం శెట్టిబలిజ కార్పొరేషన్‌ను నిర్వీ ర్యం చేస్తే చంద్రబాబు సీఎం అయ్యాక కార్పొరేషన్లను బలోపేతం చేసి నిధుల కేటాయింపులు చేస్తున్నారన్నారు. శెట్టిబలిజలను తెలంగాణలో ఓసీలుగా పరిగణిస్తున్న తరుణంలో తమ సీఎం చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు.
శెట్టిబలిజల అభివృద్ధికి కృషి : దుర్గేష్
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ శెట్టిబలిజల అభివృద్ధికి చైర్మన్, డైరెక్టర్లు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయంగా కొంతమందికి అవకాశాలు వస్తాయని, కుడుపూడి సత్తిబాబు, డైరెక్టర్లు జాతి ప్రయోజనం కోసం కృషి చేయాలన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతిని, పోలవరాన్ని చంద్రబాబు కచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఇటు పార్టీ కార్యక్రమాల్లో, అటు జాతి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ కుడుపూడి చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిందన్నారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించి గీత కులాలకు అనాడే ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని దానిని సీఎం చంద్రబాబు ముందుకు తీసుకెళ్లి మరింతగా అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు. తెలంగాణ శెట్టిబలిజ సంఘం నేతలు జయప్రకాష్‌నారాయణ, కొప్పి శెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో ఓసీలు గా ఉన్న శెట్టిబలిజలను బీసీలుగా మార్పించడంలో కూటమి ప్రభుత్వం చొరవచూపి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి సుభాష్‌కు వినతిపత్రం అందించారు. రెడ్డి సుబ్ర హ్మణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్పొరేషన్లకు నిధులు-విధులు లేకుండా నిర్వీర్యం చేస్తే చంద్రబాబు తగిన ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ శెట్టిబలిజ గౌడ, శ్రీశ యన, యాత కులాల అభివృద్ధికి పాటుపడింది టీడీపీయే అని గుర్తు చేశారు.
శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ తనకు పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ ను గజమాలతో శెట్టిబలిజ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సభలో టీడీపీ నేతలు యర్రా వేణుగోపాలరాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, కడలి రామకృష్ణ, పిల్లి శ్యామ్, సింహా నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 16 , 2024 | 01:07 AM