చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:14 AM
సారా అమ్మ కాలు, బెల్టు షాపుల నిర్వహణ, రేకా జూదాల వంటి చట్ట వ్యతి రేక కార్యక్రమాలపై వీటికి పాల్ప డే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని జిల్లా ఎస్పీ నర శింహ కిషోర్ హెచ్చరించారు. తాళ్లపూడి పోలీసు స్టేషన్‌ను ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డు లను పరిశీలించారు.
జిల్లా ఎస్పీ నరశింహ కిషోర్
తాళ్లపూడి పోలీస్‌స్టేషన్ ఆకస్మిక తనిఖీ
తాళ్లపూడి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సారా అమ్మ కాలు, బెల్టు షాపుల నిర్వహణ, రేకా జూదాల వంటి చట్ట వ్యతి రేక కార్యక్రమాలపై వీటికి పాల్ప డే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని జిల్లా ఎస్పీ నర శింహ కిషోర్ హెచ్చరించారు. తాళ్లపూడి పోలీసు స్టేషన్‌ను ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డు లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిర్మూలన, వ్యసనాలను అరికట్టే విధంగా తమ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారన్నారు. అనంతరం సిబ్బంది లోటుపై విలేకరులు అడి గిన ప్రశ్నకు బదులిస్తూ బదిలీల అనంతరం ప్రతి స్టేషన్‌లోనూ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చట్ట వ్యతిరేక కార్యక్ర మాలపై గట్టి నిఘా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంట డీఎస్పీ దేవకుమార్, రూరల్ సీఐ విజయబాబు, ఎస్‌బీ సీఐ శ్రీనివాస రావు, ఎస్‌ఐ టి.రామకృష్ణ సిబ్బంది ఉన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 01:14 AM