ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి..రియాక్షన్‌!

ABN, Publish Date - Nov 13 , 2024 | 01:06 AM

గత ప్రభుత్వంలో ఇష్టానుసారం పోస్టులు.. ఎవరికి తోచినట్టు వారు పెట్టడమే.. పార్టీపై అభి మానమో.. జగన్‌ పదవి ఇస్తారని వ్యామో హమో తెలియదు.. సోషల్‌ మీడియాను తమ ఇష్టానుసారం వాడేశారు.. రకరకాల కామెంట్లతో పిచ్చెక్కించారు.. ప్రస్తుతం కేసులతో అల్లాడు తున్నారు.

నాడు ఇష్టానుసారం పోస్ట్‌లు

నేడు 11 కేసులు నమోదు

మాజీ ఎంపీ, పోసానిపైనా కేసు

ముగ్గురి అరెస్టు..ఇద్దరికి రిమాండ్‌

పలువురి కోసం దర్యాప్తు

సోషల్‌ మీడియాపై నిఘా

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వంలో ఇష్టానుసారం పోస్టులు.. ఎవరికి తోచినట్టు వారు పెట్టడమే.. పార్టీపై అభి మానమో.. జగన్‌ పదవి ఇస్తారని వ్యామో హమో తెలియదు.. సోషల్‌ మీడియాను తమ ఇష్టానుసారం వాడేశారు.. రకరకాల కామెంట్లతో పిచ్చెక్కించారు.. ప్రస్తుతం కేసులతో అల్లాడు తున్నారు. చేసినతప్పుకు ఏనాటికైనా శిక్ష తప్ప దనే నానుడి ఈ సంఘటనకు అతికినట్టు సరి పోతుంది. కూటమి పెద్దల సహనాన్ని పరీక్షిస్తు న్న వైసీపీ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్ప డా నికి ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ఇప్పటి వరకూ మిన్నకున్న పోలీసులు రంగంలోకి దిగా రు.ఇటీవల ఐజీ అశోక్‌ కుమార్‌ ఆదేశాలతో కేసు లు పెట్టడం ఆరంభించారు. పోస్టుపై ఫిర్యా దు అందితే వెంటనే ఎఫ్‌ఐఆర్‌ వేసి చర్య లకు ఉపక్రమిస్తున్నారు.2022లో పోసాని కృష్ణమురళి అసభ్యకర పదజాలంతో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై రెచ్చిపోయారు. దీంతో అప్పట్లో జనసేన నాయకులు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కావ డంతో పోలీసులు చేతులు కట్టేసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులు నమోదు చేస్తున్నారు. ఒక కేసులో పోసానిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి జనసేన నాయకులు మరోమారు ఫిర్యాదు చేశా రు.ఈ మేరకు కేసు నమోదు చేశారు. దానిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలా ఒక్కో కేసు బయటకు లాగుతున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ మూకలు టీడీపీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తదితరులపై చెత్త పోస్టులతో చెలరేగిపోయాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌,ఎక్స్‌, ఇన్‌స్టా.. ఇలా అందు బాటులో ఉన్న ఎలకా్ట్రనిక్‌ మాధ్యమాల ద్వారా వ్యక్తిగత విషయాల్లోనూ తలదూర్చి ఇంట్లో వాళ్లపైనా సిగ్గు తలదించుకొనే విధంగా పోస్టులు పెట్టారు.మార్పు కోసం నాలుగు నెలలు సమ యం ఇచ్చిన సీఎం చంద్రబాబు..ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులతో యాక్షన్‌ లోకి దిగక తప్పలేదు.జిల్లా పోలీస్‌ కార్యాల యంలోని సైబర్‌ సెల్‌ నిరంతరాయంగా అసభ్య కర పోస్టులపై నిఘా పెట్టింది. సోషల్‌ మీడి యాలో సభ్య సమాజం సిగ్గు పడే విధంగా వైసీపీ సైకోలు పోస్టులు పెడు తున్నా ఫిర్యాదు చేయడానికి చాలా మంది వెనుకాడుతున్నారని తెలుస్తోంది.జిల్లా స్థాయిలో ఎస్పీ స్వీయ పర్య వేక్షణలో ఒక వాట్సాప్‌, టెలి గ్రాం నెంబరు ఏర్పాటు చేసి ఫిర్యాదు, సాక్ష్యాలు పంపాలని ప్రకటిస్తే మరింత ఉప యోగకరంగా ఉంటుంది. వాటి ఆధారంగా చర్యలకు ఉపక్ర మిస్తే సైకోలు అదుపులోకి అవకాశం ఉంది.

11 కేసులు.. ముగ్గురి అరెస్ట్‌

సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి, ప్రధాని మోదీ,ఎమ్మెల్యే రఘురామకృష్ణం రా జుపై అసభ్యకర పోస్టులు పెట్టడంపై కేసులు నమోదు చేశారు.ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రాజకీయ, రాజకీయేతర, వ్యక్తిగత, వివిధ సంఘాల సోషల్‌ మీడియా అడ్మిన్లకు పోలీసులు 610 వరకూ నోటీసులు ఇచ్చారు. 11 కేసులు నమోదు చేయగా ముగ్గురిని అరెస్టు చేశారు.రంగంపేటకు చెందిన వీరా బత్తుల చంద్రశేఖర్‌కు చందు వైఎస్‌ఆర్‌సీపీ పేరిట ఒక ఫేస్‌ బుక్‌ ఐడీ, చంద్రశేఖర్‌ 7799(ఇన్‌స్టా) ఉన్నాయి.వీటి ద్వారా పలు పోస్టులు పెట్టాడు.ఇతన్ని ఇటీవల గోపాల పురంలో అరెస్టు చేశారు.. స్టేషన్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. మార్గాని భరత్‌ అఫీషియల్‌ (ఇన్‌స్టా) పేరిట మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ రకరకాల పోస్టులు పెట్టడంపై త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది..ఇతన్ని అరెస్టు చేయాల్సి ఉంది.చూడచక్కని హెరిటేజ్‌ పాలు పేరిట ఒక గుర్తుతెలియని వ్యక్తి పేరిట ఫేస్‌ బుక్‌ ఐడీ ఉంది..ఇతనిపై కడియంలో కేసు లు నమోదయ్యాయి. ఇంటూరి రవికిరణ్‌ పేరున ఒక ఫేస్‌ బుక్‌ ఐడీ ఉంది.ఇతనిపై ప్రకాశంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పులి సాగర్‌ 1995 పేరిట గుర్తు తెలియని వ్యక్తి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉంది.ఇతనిపై కూడా ప్రకాశంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదై ఉంది. కేవీఆర్‌ రాజు పేరిట ఫేస్‌ బుక్‌ ఐడీ కొంతం వెంకట రమణ రాజు పేరున ఉంది. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదై ఉం ది. హరీస్‌ వార్‌ రెడ్డి ఫేస్‌ బుక్‌ ఐడీని గుర్తు తెలియని వ్యక్తి కొన సాగించిన వ్యక్తిపై ధవళే శ్వరం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యా యి. ఫేస్‌బుక్‌ ఐడీ పేరిట కామెంట్స్‌ పెట్టిన రావూరి రవితేజపై బొమ్మూరు స్టేషన్‌లో కేసు నమోదైంది. హరికృష్ణారెడ్డి. కల్లాం.90 పేరిట కె.హరికృష్ణారెడ్డి ఫేస్‌ అకౌంట్‌ నుంచి కామెం ట్స్‌ చేయడంపై ప్రకాశంనగర్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫేస్‌బుక్‌ ఐడీ పేరిట మేకా వెం కట రామిరెడ్డిచేసిన కామెంట్స్‌పై రాజానగరం స్టేషన్‌లో కేసు నమోదు కాగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఆయా సోషల్‌ మీడియా ఐడీలను బ్లాక్‌ చేయక పోవ డం గమనార్హం.పోలీసులు ఉదాసీనంగా వ్యవ హరించడంతో సైబర్‌ సైకోలు రెచ్చి పోతు న్నారనే విమర్శలు వినవస్తున్నాయి.

రెచ్చిపోతే వదిలిపెట్టం

సోషల్‌ మీడియాలో అసభ్యకర, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై గట్టి నిఘా పెట్టాం. వాటిని ఫార్వర్డ్‌ చేసినా నేరమే. ఇప్పటికే కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నాం. కొందరికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. సోషల్‌ మీడియాలో బాధ్యతతో వ్యవహరించాలి. లేనిపక్షంలో కేసులు ఎదుర్కోక తప్పదు. ఏదేమైనా రెచ్చిపోతే ఎవరైనా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం.- నరసింహ కిషోర్‌, ఎస్పీ

Updated Date - Nov 13 , 2024 | 01:06 AM