ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Social Media: సోషల్ మీడియాలో మితిమీరి కామెంట్లు, ట్రోలింగ్స్ చేస్తు్న్నారా..?

ABN, Publish Date - Jul 11 , 2024 | 01:46 AM

స్మార్ట్‌ఫోన్‌.. ఆధునిక మనిషిలో ఆ మనిషికే తెలియకుండా ఓ అంగమైపోయింది. ఒంటిపై సరైన బట్టలు లేకపోయినా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ మాత్రం ఉండాల్సిందే. చేతి వేళ్లు దాన్ని గీకుతూ ఉండాల్సిందే. లైక్‌, కామెంట్‌, షేర్‌ అనేది ఓ కొత్త జీవితం.. ట్రోలింగ్‌ వంటి పదాలూ పుట్టుకొచ్చాయి. ఈ మాయా ప్రపంచంలో సముద్రమంత మంచి ఉంటే ఆకాశమంత చెడు ఉందని పెద్దల గగ్గోలు మామూలే.

సోషల్‌ మీడియాలో మితిమీరి కామెంట్లు, ట్రోలింగ్స్‌

పోస్టులు పెట్టే ముందు.. కామెంట్‌, షేర్‌ చేసే సమయంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిందే

అదుపు తప్పితే కటకటాలే.. ఈ పోకడలపై జనంలోనూ విస్తృత చర్చ

యువత తప్పు చేస్తే వారి భవిష్యత్తూ అంధకారమే.. కుటుంబమూ అల్లరి పాలు

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

స్మార్ట్‌ఫోన్‌.. ఆధునిక మనిషిలో ఆ మనిషికే తెలియకుండా ఓ అంగమైపోయింది. ఒంటిపై సరైన బట్టలు లేకపోయినా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ మాత్రం ఉండాల్సిందే. చేతి వేళ్లు దాన్ని గీకుతూ ఉండాల్సిందే. లైక్‌, కామెంట్‌, షేర్‌ అనేది ఓ కొత్త జీవితం.. ట్రోలింగ్‌ వంటి పదాలూ పుట్టుకొచ్చాయి. ఈ మాయా ప్రపంచంలో సముద్రమంత మంచి ఉంటే ఆకాశమంత చెడు ఉందని పెద్దల గగ్గోలు మామూలే. చేతిలో ఇమిడిపోయే ఆ ఎలకా్ట్రనిక్‌ ఉపకరణంలో సోషల్‌ మీడియా.. అదో ఎల్లలు లేని ప్రపంచం. ఎన్నో వీడియోలు.. మరెన్నో ఫొటోలు.. అంతులేని సమాచారం.. అవధుల్లేని పరిజ్ఞానం.. అంతే అంతుచిక్కని కంటెంట్‌. ప్రతి సెకనుకూ పది మంది చేరుతున్న ఓ లోకం. అన్నం లేకపోయినా చేతికి వేలు ఉంటే చాలు అనేంత దారుణమైన పరిస్థితి దాపురించింది. ట్విటర్‌(ఎక్స్‌), ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, టెలిగ్రాం, వాట్సాప్‌, ఇన్‌స్టా.. ఇలా చెప్పుకుంటేపోతే ఎన్నో వేదికలు. ఆ వేదికలపై మనిషి బుర్రలోని ఆలోచనలు ఓ చిత్ర రూపంలో తాండవి స్తుంటాయి. వాటికి కొంత ఆదాయమూ వస్తుంటుంది. అం దుకే ఈమధ్య కాలక్షేపంకంటే డబ్బులు సంపాదనకూ సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడేస్తున్నారు. అయితే.. స్మార్ట్‌ఫోనూ మనదే.. వేలూ మనదే అని బాధ్యత, నిబంధనలు మరిచి ప్రవర్తించే వాళ్ల కోసం కటకటాలు ఎదురు చూస్తుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిజమే.. సమాచారాన్ని, సృజనా త్మకతను, నైపుణ్యాలను పంచుకోవాల్సిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో వికృత చేష్టలు.. విపతీర పోకడలు ఎక్కువై పోయాయి. ఇవి కొందరి మనోభావాలను దెబ్బతీస్తుంటే.. మరికొందరు సున్నిత మనస్కులు కుంగిపోతున్నారు.. ప్రాణా లు తీసుకున్నవాళ్లూ ఉన్నారు. సోషల్‌ మీడియాతో ప్రయోజ నాలు ఎన్నో ఉన్నా ప్రమాదాలు కూడా తక్కువేమీ కాదని రు జువవుతూనే ఉంది. దీంతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలపై చట్టం దృష్టి సారించింది. మా ఇష్టం అంటూ రెచ్చిపోతున్న వాళ్లను జైలుకు పంపుతోంది. ఏమైనా సోషల్‌ మీడియా వాడే ప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే చిక్కుల్లో పడినట్టే.

విపరీత పోకడలు

ఈమధ్య సోషల్‌ మీడియాలో విపరీతమైన పోకడలు కని పిస్తున్నాయి. ఇష్టానుసారం పోస్టులు.. విచ్చలవిడిగా కామెం ట్లు పెడుతున్నారు. ఇటీవల ప్రణీత్‌ హనుమంతు అనే యూ ట్యూబర్‌ తండ్రీకూతుళ్లపై పెట్టిన కామెంట్‌.. మానవ జాతికే అవమానంగా మిగిలిపోయింది. తీరా చూస్తే అతడు ఓ సీని యర్‌ ఐఏఎస్‌ కొడుకు. ఇతనేకాదు ఎంతోమంది సోషల్‌ మీడి యాను అత్యంత హేయంగా వినియోగిస్తున్నారు. వీరిలో బాగా చదువుకున్న వాళ్లూ అధికంగా ఉండడంపై సభ్యస మాజం ఆందోళన వ్యక్తంచేస్తోంది. సోషల్‌ మీడియాను మా నవ మనుగడను మెరుగుపరుచుకోడానికి, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వేదికలుగా చూడకుండా.. తమ వికృత చేష్టలకు ప్లాట్‌ఫాంలుగా భావిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్టు, కామెంట్‌ పెడితే దానికంటే చాటింపే మేలు అనిపి స్తుంది. ఎక్కడెక్కడికో అది వెళ్లిపోతుంది. ఫోన్లలో డౌన్‌ లోడ్‌ కూడా అయిపోతోంది. దీంతో కామెంట్‌ పెట్టిన వారి మాటెలా ఉన్నా.. బాధితులు మాత్రం అల్లాడిపోతున్నారు.

కచ్చితంగా పట్టేస్తారు

సోషల్‌ మీడియా అనేది ప్రపంచంలో అత్యంత ప్రజా దరణ పొందిన కమ్యూనికేషన్‌ మార్గం. ప్రపంచవ్యా ప్తంగా 5 బిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇది ప్రపంచ జనాభాలో 62 శాతం. రోజు రోజుకూ ఆ సంఖ్య వేలల్లో పెరుగుతూనే ఉంది. దానితోబాటే అత్యం త హానికరమైన ప్రతికూలతలు కూడా పెరుగుతూ పోతున్నాయి. సోషల్‌ మీడియా వాడకం విపరీతమైన తర్వాత సామాజిక, భావోద్వేగ, మానవ సంబంధాలు.. కుటుంబ బంధాలు పలుచబడిపోయాయి. బుర్రలో పదు ను తగ్గిపోతోంది. అందరూ ఉన్నా ఒంటరివాళ్లు ఎక్కువై పోతున్నారు. పుస్తకాలు చదవడం ఎప్పుడో మానేశారు. చేతిలో పుస్తకం మాయమైపోయింది. ఏదో తెలియని గజి బిజి, గందరగోళం మెదడును కమ్మేస్తోంది. ఒక కుటుం బంలో నలుగురు ఉంటే సోషల్‌ మీడియలో విహరించ డానికి ఇచ్చిన సమయంలో సగం కూడా ఒకరితో ఒకరు మాట్లోడుకోడానికి ఇవ్వడం లేదు. బస్సులో, రైళ్లలో, విమా నాల్లో పక్కపక్కన కూర్చున్న వారు సైతం స్మార్ట్‌ఫోన్‌తో గడిపేస్తూ ప్రయాణం సాగించేస్తున్నారు. సోషల్‌ మీడి యా వల్ల సైబర్‌ క్రైం రేటు, హ్యాకింగ్‌ ఉరకలు పెడు తోంది. ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియా బజార్లో పెడుతున్నారు. లేదా బెదిరించి డబ్బు లు గుంజుతున్నారు. అయితే.. ఇప్పుడు అధునాతన సాం కేతికత అందుబాటులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌ చోరీకి గురైతే దానిని పూర్తిగా పనిచేయకుండా చేసే సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. అలాగే సోషల్‌ మీడియా ద్వారా ఎవరు బాధ్య తారహితంగా.. నిబంధనలు గాలికి వదిలేసి ప్రవర్తించారో పోలీసులు కచ్చితంగా పట్టేస్తారు. ఆ పరిజ్ఞానాన్ని ఇప్ప టికే వాడుతున్నారు. ఎన్ని లక్షలసార్లు షేర్‌ చేసినా సదరు పోస్టు మూలాన్ని వెతికి వెలికితీసే సదుపాయం ఉంది. ఏ మూలన దాక్కునా పట్టుకొచ్చి చట్టం ముందు నిల బెట్టడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

చాలామంది చెప్పుకోలేక...

సోషల్‌ మీడియాలోని అధిక శాతం మంది బాధితులు బయటకు చెప్పుకోకుండా కుమిలిపోతుంటారు. కొందరు తేలిగా వదిలేస్తారు. అందువల్ల చట్టాన్ని ఆశ్రయించే వాళ్ల సంఖ్య కూడా బాగా తక్కువగా ఉంటోంది. పెద్ద ఇబ్బంది ఎదురైతే గానీ చట్టాన్ని ఆశ్రయించడం లేదు. ఇది సరికా దని నిపుణులు చెబుతున్నారు. చట్టపరంగా శిక్షలుపడిన ప్పుడే సోషల్‌ మీడియా వల్ల ప్రతికూలతలు తగ్గుతా యని సూచిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో రెండు కేసు లు నమోదయ్యాయి. సోషల్‌ మీడియా, సైబర్‌ క్రైంలను ప్రతి క్షణం గమనిస్తూ ఉండడానికి ప్రత్యేకంగా ఒక సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లతో ఒక టీం నిరంతరం పనిచేస్తోం ది. అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడితే ఇట్టే పట్టేసి బాధ్యులను కటకటాల్లోకి నెట్టేస్తారు. ఆన్‌లైన్‌ వేధింపులు, సోషల్‌ మీడియా ట్రోలింగ్‌లకు పాల్పడితే ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 67 ప్రకారం ఐదేళ్ల శిక్ష పడుతుంది. ఉద్దేశపూర్వ కంగా మహిళను లోక్ష్యంగా చేసుకొని సోషల్‌ మీడియా వేదికల ద్వారా అవమానించడం, వెంటపడడం, దూషిం చడం వంటి వేధింపులకు పాల్పడితే ఐదేళ్ల జైలుకు సిద్ధం కావాల్సిందే. ఇలా వివిధ చట్టాల ప్రకారం శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతి కుటుంబంలోనూ ఇలా కామెంట్లు పెడుతుంటే వెం టనే వారికి పోకడలను అరికట్టేలా చర్యలు చేపట్టాలి.

Updated Date - Jul 11 , 2024 | 09:28 AM

Advertising
Advertising
<