ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం

ABN, Publish Date - Jul 06 , 2024 | 12:46 AM

: ప్రజలు ఎదు ర్కొంటు న్న సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని జనసేనపార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మ ర్రెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రజాసమస్యలు, పిఠాపురం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నిర్ధిష్ట ప్రణాళికతో ఉన్నారని చెప్పారు.

జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి

గొల్లప్రోలు రూరల్‌, జూ లై 5: ప్రజలు ఎదు ర్కొంటు న్న సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని జనసేనపార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మ ర్రెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రజాసమస్యలు, పిఠాపురం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నిర్ధిష్ట ప్రణాళికతో ఉన్నారని చెప్పారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్‌ నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడురోజుల పర్యటనలో భాగంగా పవన్‌కల్యాణ్‌ ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, అధికారులతో సమావేశాలు నిర్వహించి వాటిపై అధ్యయనం చేశారన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రథమ ప్రాదాన్యం ఇవ్వనున్నారని తెలిపారు. ఇప్పటికే దీనిపై దృష్టిసారించారని చెప్పారు. సముద్రపు కోత ప్రాంతాలను స్వయంగా పరిశీలించడంతోపాటు నిపుణులతో చర్చించారని తెలిపారు. ఉప్పాడ నుంచి కాకినాడ వరకూ గల సముద్ర తీర ప్రాంతాన్ని విశాఖ ఆర్కే బీచ్‌ మాదిరిగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో పర్యావరణానికి హాని కలిగించని పరిశ్రమల స్థాపనకు పవన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభమైందని చెప్పారు. సమావేశంలో జనసేన ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్‌, కడారి తమ్మయ్య నాయుడు, పిల్లా శివశంకర్‌, సూరవరపు సురేష్‌, ఓదూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2024 | 12:46 AM

Advertising
Advertising