ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విరాళాలు.. ధారాళంగా...

ABN, Publish Date - Dec 08 , 2024 | 01:03 AM

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా.. భక్తితత్వా నికి నిలయంగా.. ప్రశాంతతకు ఆలవాలంగా నిలుస్తోంది.. అన్నవరంలోని సత్యదేవుడి పుణ్య క్షేత్రం. రాష్ట్రంలో తిరుపతి తర్వాత ఆ స్థాయి లో ఖ్యాతి గడించిన ఆలయమిది. ఈ ఆల యానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆలయానికి హుండీలతోపాటు దర్శనాలు, వ్ర

దాతల సహకారంతో నిర్మించిన వసతి కోసం శివ సదన్‌

సత్యదేవుడి ఆలయానికి భక్తుల విరాళాల వెల్లువ

నిత్యాన్నదాన పథకానికి ప్రారంభం నుంచి

ఇప్పటికి 1.50 లక్షలమంది దాతల నుంచి రూ.62కోట్లు

సత్రం గదుల డొనేషన్‌కు ముందుకొస్తున్న దాతలు

దాతలకు ప్రత్యేక

గుర్తింపుగా సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినం కార్డులు జారీ

వీటి ద్వారా సదరు దాతకు ప్రత్యేక సౌకర్యాల కల్పన

(ఆంధ్రజ్యోతి- అన్నవరం)

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా.. భక్తితత్వా నికి నిలయంగా.. ప్రశాంతతకు ఆలవాలంగా నిలుస్తోంది.. అన్నవరంలోని సత్యదేవుడి పుణ్య క్షేత్రం. రాష్ట్రంలో తిరుపతి తర్వాత ఆ స్థాయి లో ఖ్యాతి గడించిన ఆలయమిది. ఈ ఆల యానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆలయానికి హుండీలతోపాటు దర్శనాలు, వ్ర తాలు, సత్రం గదులు, ప్రసాదం, ఆలయ పరిధిలో వివిధ షాపుల వేలం వంటి రూపా ల్లో ఆదాయాలు వస్తుంటాయి. ఇదంతా ఒకె త్తు అయితే భక్తుల విరాళాలు ప్రత్యేకం. ఇక్క డికి వచ్చే చాలామంది స్వామికి తమ వంతుగా వివిధ రూపాల్లో విరాళాలు ఇస్తుం టారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు సౌకర్యాలనకు కానుకలతోపాటు దాతల దాతృత్వం కూడా ఎంతో ముఖ్యం. అసలు సత్యదేవుడికి ఎన్ని రూపాల్లో విరాళాలు వస్తుంటాయి. ఎంత వచ్చి ఉంటాయి. ఎన్నిరకాలుగా ఇవ్వొచ్చు... దాతలకు దేవస్థానం కల్పించే సౌకర్యాలు వంటి విశేషాలు తెలుసుకుందాం..

కొండపై ప్రత్యేక కౌంటర్లు

అన్నవరం సత్యదేవుడి ఆలయానికి ఎందరో దాతలు తమవంతు సాయమందిస్తూ ఉంటారు. అన్నదానం, గోసంరక్షణ ట్రస్టు, సత్రం గదులకు సంబంధించి దేవస్థానం తరఫున విరాళాలు స్వీక రిస్తుంటారు. వీటికి రత్నగిరిపై ప్రత్యేకంగా కౌం టర్లు ఏర్పాటుచేశారు. అన్నదానానికి సంబంధించి మూడుచోట్ల కౌంటర్లు ఉన్నాయి. గోసంరక్షణ, సత్రం గదులకు కూడా ఏర్పాటు చేశారు. దాతలు వీటిని సంప్రదించి విరాళాలు ఇస్తుంటారు.

సత్యదేవా నిత్యాన్నదాన పథకం

అన్నవరం దేవస్థానంలో అధికంగా సత్యదేవా నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అం దిస్తుంటారు. ఈ పథకం 1987లో ప్రారంభం కాగా ఇప్పటివరకు రూ.62 కోట్లు విరాళాలుగా వచ్చాయి. వీటిపై వచ్చే వడ్డీతో ప్రతినిత్యం నిత్యాన్నదానం చేస్తుంటారు. ఇప్పటివరకు ఈ పథకం లో రూ.1116 నుంచి ఆపై విరాళాలు అందించిన దాతల సంఖ్య లక్షా 50 వేలమంది వరకు ఉన్నా రు. వీటిపై ఏటా వడ్డీల రూపంలో రూ.4.5 కోట్లు సమకూరుతోంది. కేవలం ఈ వడ్డీతోనే సరాసరిన రోజుకు 4 వేలమందికి ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు. వీటిలో రూ.లక్షపైబడి విరాళమిచ్చిన వారికి మాత్రమే కొన్ని వెసులుబాట్లు కల్పి స్తారు. వీరికి మొదటి ఏడాదికి ఒకసారి ఉచి తంగా సత్రం గది, ఉచితంగా వ్రతం చేసుకునే అవకాశం, కుటుంబ సభ్యులకు అంతరాలయ దర్శనం కల్పిస్తున్నారు. తదుపరి ఏడాది నుంచి కేవలం ప్రత్యేక దర్శన సౌకర్యం మాత్రమే ఉం టుంది. ఈ నిధులు కేవలం అన్నదాన ట్రస్ట్‌కు చెందుతాయి. ఈ పథకానికి సెక్షన్‌ 80జీ ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. దీనికి రూ.500పైబడి విరాళం ఇవ్వొచ్చు. రూ.లక్షపైబడి డొనేషన్‌ చేసినవారి పేరు వారు సూచించిన రోజున అన్నదానం వద్ద బోర్డులో ప్రదర్శిస్తారు.

సత్రం గదులకు డొనేషన్లు

దేవస్థానంలో ప్రస్తుతం హరిహరసదన్‌, శివసదన్‌ కాటేజీలకు డోనార్‌ స్కీం అమలవుతోంది. హరిహరసదన్‌లో ఒక రూంకు డోనార్‌ రూ.5 లక్షలు, శివసదన్‌లో రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వీరి పేరు వీరికి కేటాయించిన సత్రం గదిపై శాశ్వతంగా లిఖిస్తారు. గది డోనార్‌కు ఏడా దిలో 30రోజులపాటు దాతకుగానీ, దాత సిఫార్సు చేసిన వారికిగానీ ఉచితంగా పదేళ్లపాటు కొనసాగిస్తారు. వీరికి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. దాత 15రోజులు ముందుగా దేవస్థానం సంబంధిత విభాగానికి ఈ సమాచారం చేరవేయాల్సి ఉం టుంది. అప్పటికప్పుడు వస్తే ఆలయంలో భక్తుల రద్దీని బట్టి ప్రాధాన్య క్రమంలో సత్రం గదులు కేటాయిస్తారు. ఈ విరాళాల ద్వారా వచ్చిన మొత్తం దేవస్థానం మెయిన్‌ అకౌంట్‌కు జమచేస్తారు. వ్యక్తిగత గెస్ట్‌హౌస్‌లు కూడా విరాళాల జాబితాలో ఉన్నాయి. కొండపై ఉన్న అంజనీ గెస్ట్‌ హౌస్‌, రామరాజు నిలయం, పల్లవి గెస్ట్‌హౌస్‌, సీతానిలయం, సత్యనిలయం, సత్యకిరణ్‌నిలయం, సీతారామసదన్‌ గెస్ట్‌హౌస్‌ తదితర ఏడు గెస్ట్‌హౌ స్‌లను దాతలు నిర్మించారు. వీరికి ఏడాదిలో 30 రోజులపాటు ఉచితంగా గెస్ట్‌హౌస్‌ కేటాయిస్తారు. నెలరోజుల తర్వాత కూడా రద్దీనిబట్టి ఈ దాతలు సిఫార్సు చేసినవాళ్లకి వీటిని ఇచ్చే అవకాశం ఉం ది. దేవస్థానం పరిధిలోనే కేటాయింపు చేస్తారు.

గోసంరక్షణ ట్రస్ట్‌కు విరాళాలు

భక్తులు గోసంరక్షణ ట్రస్ట్‌కు కూడా విరాళాలు అందించవచ్చు. పదేళ్ల కిందట నెలకొల్పిన ఈ ట్రస్ట్‌ ద్వారా వచ్చే విరాళాలను గోవుల సంరక్షణ, దాణా తదితర వాటికి వినియోగిస్తుంటారు. ఇప్ప టివరకు ఈ ట్రస్ట్‌కు రూ.1.57 కోట్లు విరాళాలుగా వచ్చాయి. దేవస్థానంలో 49 ఆవులు, 23 గిత్తలు, ఎద్దులు 4, పెయ్యిలు 21 ఉన్నాయి. విరాళమిస్తే ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

స్వల్పంగానే అతిపెద్ద డోనార్లు

అన్నవరం దేవస్థానంలో రూ.కోటిపైబడి విరాళాలందించిన వారు స్వల్పంగానే ఉన్నారు. వీరిలో కాకినాడ తిమ్మాపురంలో కర్రి బామిరెడ్డి జమిందారు 45 ఎకరాల భూమిని విరాళంగా అందిం చారు. లలిత రైస్‌ ఇండస్ట్రీస్‌ అధినేతలు మట్టే సత్యప్రసాద్‌ ప్రసాదం తయారీ భవనాన్ని రూ.4 కోట్లతో, స్వామి, అమ్మవార్లకు వజ్రకిరీటం, కర్ణాభరణాలు రూ.3 కోట్లతో, ఇంకా పలు వెండి వస్తువులు, గర్భాలయ బంగారు తాపడం పనులు కూడా చేపట్టారు. రూ.25 లక్షలతో సహస్ర దీపాలంకరణ మందిరం నిర్మించారు. లలిత రైస్‌ మరో ఎండీ మట్టే శ్రీనివాస్‌, సత్యశ్రీనివాస ఉచిత కల్యాణవేదికను రూ.4.5 కోట్లతో చేపట్టడంతోపాటు వంశపారంపర్యంగా స్వామివారి నివేదనకు అవ సరమయ్యే బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. నిత్యం జరిగే పంచహారతులకు వెండి సామగ్రిని అందించారు. పారిశ్రామికవేత్త ఎంఎస్‌ రెడ్డి అంజనీ గెస్ట్‌హౌస్‌, ఉచిత కల్యాణమండపాలను నిర్మించారు. రాజమహేంద్రవరానికి చెందిన పెన్నాడ నాగమణి రూ.2 కోట్లతో ఉచిత డార్మెటరీ నిర్మించారు. అదేవిధంగా మరో ఐదుగురు దాత లు పలు గెస్ట్‌హౌస్‌లు నిర్మించారు.

విరాళాన్ని బట్టి కార్డులు

నిత్యాన్నదాన పథకానికి విరాళం అందించే దాతలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో దేవస్థానం వారి విరాళాన్ని బట్టి పేర్లు కేటాయించింది. రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు దాతలుగా, రూ.10వేల నుంచి రూ.50 వేల వరకు పోషకులుగా, రూ.50 వేల నుంచి రూ.లక్షవరకు రాజపోషకు లుగా, రూ.లక్ష పైబడి మహారాజపోషకు లుగా పరిగణించారు. దీంతోపాటు దాతలకు వారిచ్చిన డొనేషన్‌ ఆధారంగా ప్రత్యే క సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇటీ వల దేవస్థానం ప్రత్యేక కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. వీటిలో రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు విరాళం అందించిన వారికి సిల్వర్‌ కార్డు, రూ.10 లక్షల నుంచి రూ.కోటి విరాళమిచ్చిన వారికి గోల్డ్‌కార్డు, రూ.కోటి ఆపైన డొనేట్‌ చేసిన వారికి ప్లాటినం కార్డులను జారీ ప్రారంభించింది.

విరాళం అందించాలనుకుంటే..

ఆలయంలో స్వామివారికి విరాళం అందించాలనుకుంటే కొండపై సంబంధిత కౌంటర్‌లో సంప్రదించాలి. నగదు, చెక్కు, డిజిటల్‌ పేమెంట్‌ రూపాల్లో విరాళం ఇవ్వొచ్చు. నగదు అయితే రూ.49 వేల లోపు స్వీకరిస్తారు. ఆపైన ఎంత ఇచ్చినా తప్పనిసరిగా పాన్‌కార్డు ఇవ్వాలి. అన్న వరం దేవస్థానం వెబ్‌సైట్‌లోగానీ, యాప్‌ గానీ విరాళాన్ని డిజిటల్‌ పేమెంట్‌ చేయొ చ్చు. ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేసిన తర్వాత సంబంధిత పత్రాలతో దేవస్థానాన్ని సంప్రదించి తగిన సౌకర్యాలు పొందొచ్చు.

డోనార్‌ సెల్‌ ఏర్పాటు కలగానే..

అన్నవరం దేవస్థానంలో డోనార్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని కొంతకాలంగా ప్రతిపాదనలు ఉన్నా అవి కలగానే మిగిలిపోతున్నాయి. సాధారణ దాతలకు దేవస్థానం తరఫున సౌకర్యాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించ డానికి డోనార్‌ సెల్‌ ఏర్పాటు చేస్తే విరా ళాల తదనంతర సౌకర్యాల కల్పనకు అటూఇటూ తిరగాల్సిన పని ఉండదని దాతలు కోరుతున్నారు.

Updated Date - Dec 08 , 2024 | 01:03 AM