హోరాహోరీగా అండర్-14 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:48 AM
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమలాపురంలో అండర్-14 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు రెండో రోజు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి.
అమలాపురం టౌన్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమలాపురంలో అండర్-14 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు రెండో రోజు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. అమలాపురం జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కిమ్స్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పోటీలను ఎస్‌జీఎఫ్ కార్యాదర్శి అడబాల విజయ్ శ్రీనివాస్, పప్పుల శ్రీరామచంద్రమూర్తి అసోసియేషన్ కార్యదర్శి విత్తనాల శ్రీనివాస్ పర్యవేక్షించారు. రెండో రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు శనివారం క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడతాయని వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చొల్లంగి ప్రసాద్, కార్యదర్శి వీవీవీఎస్‌ఎన్ మూర్తి, జోన్ అధ్యక్షుడు వైఎస్వీ రమణారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు తోట రవి తెలిపారు. క్వార్టర్ ఫైనల్స్ పోటీల్లో కృష్ణాజిల్లా-అనంతపురం జట్ల మధ్య, తూర్పుగోదావరి-విశాఖపట్నం, చిత్తూరు-శ్రీకాకుళం, పశ్చిమగోదావరి-కర్నూలు జట్ల మధ్య పోటీలు నిర్వహిస్తారు. అనంతరం సెమీఫైనల్, ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆర్గనైజింగ్ కార్యదర్శి తోట రవి, కామన మధుసూదనరావు వెల్లడించారు. విద్యార్థులకు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా, డీఎస్డీవో పీఎస్ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో పేరొందిన క్రికెట్ వెటరన్ క్రీడాకారులు మిద్దే ఆదినారాయణ, శ్రీను సోదరులు, ఆకుల చిన్నీలను ఆర్గనైజర్లు, పూర్వపు క్రీడాకారులు సత్కరించారు.
Updated Date - Nov 30 , 2024 | 12:48 AM