ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందింది

ABN, Publish Date - Jun 15 , 2024 | 01:29 AM

రాష్ట్రంలో గత ఐదేళ్లుగా నడిచిన రాక్షసపాలన అంతమొందిందని శ్రీలంక బౌద్ధభిక్షువు బోధి హీన్‌ అన్నారు. ఏపీలో కూటమి పాలన వస్తుందని ఈనెల 3న తెలంగాణలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో తాను వెల్లడించడం జరిగిందన్నారు.

జనసేన నియోజకవర్గాల్లో డొక్కా సీతమ్మ క్యాంటిన్లు ఏర్పాటుచేయాలి

శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధి హీన్‌

పి.గన్నవరం, జూన్‌ 14: రాష్ట్రంలో గత ఐదేళ్లుగా నడిచిన రాక్షసపాలన అంతమొందిందని శ్రీలంక బౌద్ధభిక్షువు బోధి హీన్‌ అన్నారు. ఏపీలో కూటమి పాలన వస్తుందని ఈనెల 3న తెలంగాణలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో తాను వెల్లడించడం జరిగిందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరంలో ఆయ న డొక్కా సీతమ్మ నివాసాన్ని సందర్శించి అనంతరం మాట్లా డారు. అన్నక్యాంటీన్‌లను స్వాగతిస్తున్నామని, ఎన్నికల సమ యంలో పవన్‌కల్యాణ్‌ డొక్కా సీతమ్మ క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ఆమేరకు జనసేన గెలిచిన 21 నియోజకవర్గాల్లో సీతమ్మ క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. కుల, మతా లకు అతీతంగా భోజనాలు అందించిన ఘనత సీతమ్మకు ఉందని ఆయన గుర్తుచేశారు. పవన్‌కల్యాణ్‌కు శ్రీలంకలో భారీగా అభిమానులు ఉన్నారని, ముఖ్యంగా బౌద్ధ బిక్షువులు, ఉపాసకులలో ఎక్కువ శాతం అభిమానులు ఉన్నారన్నారు. అమరావతి అనే పేరు బౌద్ధమతం నుంచే పుట్టిందన్నారు. ఎన్నికల సమయంలో శ్రీలంక నుంచి వచ్చి న పలువురు బౌద్ధ భి క్షువులు అమరావతి తోపాటు రాష్ట్రమంతా పర్యటించామన్నారు. ముఖ్యంగా అమరా వతి రైతులను కలిసి కూటమి ప్రభుత్వం వస్తుందని ధైర్యం చెప్పామన్నారు. త్వర లో నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఏపీ రాజధాని అమరావతికి శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షువులు, బౌద్ధ ఉపాసకులు రాబోతున్నారని ఆయన తెలిపారు. వారందరూ సీఎం చంద్రబాబునాయుడిని కలిసి రాష్ట్రంలో ఉన్న 13 ఉమ్మ డి జిల్లాలను కలిపి ఒక కేడర్‌గా ఏర్పాటుచేసి, బౌద్ధాన్ని తద్వారా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కోరతారన్నారు.

Updated Date - Jun 15 , 2024 | 01:29 AM

Advertising
Advertising