సుద్దగడ్డకు మళ్లీ వరద
ABN, Publish Date - Oct 03 , 2024 | 11:52 PM
గొల్లప్రోలు, అక్టోబరు 3: సుద్దగడ్డకు మళ్లీ వరద వచ్చి ంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో గొల్లప్రోలు వద్ద సుద్దగడ్డ(కొండ)కాలువ వరద నీటితో ఉధృ తంగా ప్రవహిస్తున్నది. 2నెలల వ్యవధిలో సుద్దగడ్డకు వరద రావడం ఇదో ఆరోసారి. సుద్దగడ్డ వరద నీరు గొల్లప్రోలు శివారు జగనన్న కాలనీ రహదారిపైకి
గొల్లప్రోలు, అక్టోబరు 3: సుద్దగడ్డకు మళ్లీ వరద వచ్చి ంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో గొల్లప్రోలు వద్ద సుద్దగడ్డ(కొండ)కాలువ వరద నీటితో ఉధృ తంగా ప్రవహిస్తున్నది. 2నెలల వ్యవధిలో సుద్దగడ్డకు వరద రావడం ఇదో ఆరోసారి. సుద్దగడ్డ వరద నీరు గొల్లప్రోలు శివారు జగనన్న కాలనీ రహదారిపైకి చేరింది. నాలుగున్నర అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో కాలనీవాసులకు ఇబ్బందులు ప్రారంభమ య్యా యి. ఆ నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. చిన్నారులు, కళాశాల విద్యార్థులు పంటపొలాల మీదుగా వెళ్తున్నారు. గొల్లప్రోలు-తాటిపర్తి పంచాయతీరాజ్ రహదారిపైకి వరద నీరు చేరింది. తరచూ వరద రావడంతో ఇక్కట్లు పడుతున్నామని జగనన్నకాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - Oct 03 , 2024 | 11:52 PM