నేడు గురుపూజోత్సవం
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:03 AM
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో గురు పూజోత్సవం-2024 నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి తెలిపారు.
అమలాపురం టౌన్/ముమ్మిడివరం, సెప్టెంబరు 4: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో గురు పూజోత్సవం-2024 నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొని జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరిస్తారని ఆమె చెప్పారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో జరిగే కార్యక్రమంలో జిల్లా నుంచి ఎంపిక చేసిన 42 మంది ఉత్తమ గురువులను సన్మానించనున్నట్టు తెలిపారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
కె.శ్రీనివాసరావు(ఐ.పోలవరం మండలం), కేజీ సత్యనారాయణ (అమలాపురం), డి.సత్తిరాజు (రాయవరం), కె.భ్రమరాంబికాదేవి (అంబాజీపేట), కె.శ్రీదేవిరత్నం (ఐ.పోలవరం), ఆర్.శేషగిరిరావు (పి.గన్నవరం), పీఎస్‌ఏ మంగాదేవి (కాట్రేనికోన), కేవీ నాగేశ్వరరావు (సఖినేటిపల్లి), బి.మధుసూదనరావు (అయినవిల్లి), కె.శకుంతల (రాజోలు), ఎం.రవికుమార్ (అమలాపురం), కేవీవీఎస్‌ఎన్ మూర్తి (మామిడికుదురు), బి.మల్లేశ్వరరావు (ఉప్పలగుప్తం), కె.వెంకటలక్ష్మి (ముమ్మిడివరం), సీహెచ్ రాజరాజేశ్వరి (అల్లవరం), కేఎస్ విజయలక్ష్మి (మలికిపురం), కేవీ సత్యనారాయణ (ఆత్రేయపురం), డి.భాగ్యలక్ష్మి (ఆలమూరు), ఎం.పైడిరాజు (రావులపాలెం), కె.ఆనందరావు (కొత్తపేట), బి.ఆదిలక్ష్మి (రామచంద్రపురం అర్బన్), ఎస్.శంకరరామం (కె.గంగవరం), ఎం.సత్యనారాయణ (రాయవరం), టి.లీలాకుమారి (కపిలేశ్వరపురం), కేవీఎస్‌ఎస్‌జేబీఎల్ రత్న (రామచంద్రపురంరూరల్), ఎస్.వేణుగోపాల్ (మండపేట), ఎం.బాలాజీ (అమలాపురం), కేవీఎస్‌ఎస్‌ఎం సుబ్బరాయశర్మ (అమలాపురం), వై.సంజీవయ్య (అమలాపురం), ఎంఎస్ మహాలక్ష్మి (అమలాపురం), ఎన్.రఘురామయ్య (మామిడికుదురు), ఎం.సత్యనారాయణ (సఖినేటిపల్లి), జి.నాగలక్ష్మి (మామిడికుదురు), టీఎల్ రెడ్డి (రావులపాలెం), ఎండీ అబ్దుల్‌ఖాన్ (ఆలమూరు), ఎస్.కృపానందం (పి.గన్నవరం), జి.సత్యనారాయణ (కొత్తపేట), వైవీవీఎస్‌ఎల్ సూర్యకుమారి (రామచంద్రపురం), బీపీ రామకృష్ణ (రాయవరం), కె.శ్రీనివాస్ (రాయవరం), పి.రామచంద్రారెడ్డి (మండపేట), పి.హరిఅప్పారావు (ముమ్మిడివరం మండలం) ఉన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 01:03 AM