ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేటి నుంచి చింతలూరు నూకాంబికా జాతర

ABN, Publish Date - Apr 07 , 2024 | 01:27 AM

గోదావరి జిల్లాలలో పేరుగాంచిన ప్రధా న జాతరలలో ఒకటైన బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా ఆలమూ రు మండలం చింతలూరు నూకాంబికా జాతర ఈనెల 7నుంచి ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

8న తీర్థ మహోత్సవం

ఆలమూరు, ఏప్రిల్‌ 6: గోదావరి జిల్లాలలో పేరుగాంచిన ప్రధా న జాతరలలో ఒకటైన బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా ఆలమూ రు మండలం చింతలూరు నూకాంబికా జాతర ఈనెల 7నుంచి ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈనెల 7న జాతర మహోత్సవం, 8న తీర్ధమహోత్సవం, 9న ఉగాది ఉత్సవాలతోపాటు నెలరోజలపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. భ్రక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా కట్టుదట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మద్దూరి శివరామకృష్ణ తెలిపారు. దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. లక్షలాదిమంది భక్తులు తరలిరానున్న ఈజాతరను సమర్ధవంతంగా నిర్వహించాలని పలుశాఖల అధికారులతో సమన్వయ కమిటీలను కొత్తపేట ఆర్డీవో జివివి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. చంటిపిల్లల దేవతగా కొలిచే నూకాంబికా అమ్మవారికి జాతర ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు, చెల్లించుకుని వారపోత, తుళ్లిబిళ్ల, కావిడి కోళ్లు, గండాదీపం ఇక్కడ ప్రధానంగా మొక్కులు తీర్చుకుంటారు. సాధారణంగా చంటిపిల్లల్లో వచ్చే ఆటలమ్మ, పొంగు వంటి వ్యాధులు అమ్మవారి ఆగ్రహాంవల్ల వస్తాయని అందువలన ఈవ్యాధి సోకిన చంటిపిల్లలచేత ఈ మొక్కులు తీరుస్తుంటారు. ఈవ్యాఽదులు రానివారు అమ్మ వారి అనుగ్రహం ఉందని మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పూర్వపు ఉభయగోదావరి జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు చింతలూరు తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తుల కోసం రావులపాలెం, అమలాపురం, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం డీపోల నుంచి ఇక్కడికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆలమూరు ఎస్‌ఐ శ్రీనునాయక్‌ చెప్పారు.

Updated Date - Apr 07 , 2024 | 01:27 AM

Advertising
Advertising